తెలంగాణాలో వైఎస్సార్సీపీ ఎందుకు పోటీ చేయదు అంటాడు చంద్రబాబు. జనసేన ఎందుకు పోటీ చేయదు అని కూడా ప్రశ్నిస్తాడు. నెల్లూరులో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో చంద్రబాబు చిత్తచాంచల్యం మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ మోదీ మధ్య సంబంధం అంటాడు. వైసీపీ బీజేపీ సంబంధం అంటాడు. చివరకు కేసీఆర్, పవన్, జగన్ సంబంధం అంటాడు.
దిల్లీ గల్లీలు తిరిగి, కలకత్తాలో కాళ్లు మొక్కి కనబడ్డ ప్రతి జాతీయ నాయకుడి చేతులు పట్టుకుని కూటమిలో కుదురుకున్నది చంద్రబాబు అని దేశం మొత్తానికి తెలుసు. తన అవసరం కోసం మొన్న బీజీపీతో, జనసేనలతో, నేడు కాంగ్రెస్తో సంబంధాలు పెట్టుకున్నది చంద్రబాబు. పబ్లిక్ గా ప్రజల ముందు ఆయా పార్టీలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేదీ చంద్రబాబే. మితృత్వపోటీ, నామమాత్ర పోటీ అంటూ సీట్లు పంచుకుని కాంగ్రెస్ టీడీపీ కలిపి ఫ్లెక్సీలు వేయించుకుంటోంది కూడా చంద్రబాబే. గురివింద తన నలుపెరగదన్న చందంగా చేసేవన్నీ తాను చేస్తూ ప్రతిపక్షం బీజేపీతో సంబంధం పెట్టుకుంటోందని గగ్గోలు పెడుతున్న చంద్రబాబు బుద్ధిని తిట్టడానికి తెలుగులో పదాలే సరిపోవడం లేదు. పవన్, జగన్ లు తెలంగాణాలో ఎందుకు పోటీ చేయరు అని అడిగే బాబు ఎవరు ఎక్కడ పోటీ చేయాలో, పార్టీ బలాబలాలేమిటో నిర్థారించుకునేది ఆయా పార్టీలే అని తెలియకే అంటున్నాడా?
వైసీపీ అధినేత కేసుల భయంవల్ల నరేంద్రమోదీ ముందు నిలబడడు అని వాఖ్యానించాడు బాబు. పార్లమెంట్ లో అవిశ్వాసం పెట్టి, తన ఎంపిలతో రాజీనమాలు చేయించి ఐదురోజులపాటు నిరవధిక నిరాహారదీక్షకు పూనుకున్న ఎపి ప్రతిపక్ష నాయకుడు జగన్ కు ధైర్యం లేదు.
మోదీ సీటులో లేని సమయంలో అక్కడ తిరిగే టిడిపి ఎంపిలు, ప్రధాని లేనప్పుడు ఆయన నివాసం ముందు హడావిడి చేసి మోదీ వచ్చేలోపు అమరావతి పారిపోయి వచ్చిన ఎంపిలకు, నరేంద్ర మోదీ ముందు నిలబడే ధైర్యం ఉంది.
ఓ పక్క ఏపీలో ధర్మపోరాట దీక్షలని, మోదీపై యుద్ధం అని జబ్బలు చరుచుకుని దిల్లీలో మోదీ ముందు 90డిగ్రీల కోణంలో వంగి చేతులు జాపేసి అవకాశం ఉంటే కాళ్లమీద పడిపోవడానికి సిద్ధపడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యవంతుడు. స్థైర్యవంతుడూను.
పీకలు తెమ్మంటే పిలకలు తెచ్చి చూడు నా ప్రతాపం అన్నాడట వెనకటికో ప్రబుద్ధుడు. చూడబోతే చంద్రబాబు తీరు కూడా అలాగే ఉందంటున్నారు తెలుగు ప్రజలు.