40 ఏళ్ల అనుభ‌వ‌మా నువ్వెక్క‌డ‌??

 

అసెంబ్లీలో అర్థంత‌రంగా క‌నిపించ‌కుండా పోయింది ఓ న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం. 

నిన్న‌టిదాకా అధికార ప‌క్షంలో విర్ర‌వీగిన సీనియారిటీ ప్ర‌తిప‌క్షంలో ప‌దినిమిషాలు కూర్చోలేక సీటు ఖాళీ చేసింది.

ఒక‌ప్పుడు ప్ర‌తిపక్షాన్ని టార్గెట్ చేసి ట్రోల్ చేసింది.

అదుపులేని నోరు అడ్డంగా మాట్లాడుతుంటే ఆప‌మ‌ని చెప్ప‌కుండా చోద్యం చూసింది.

ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నించబోతే నిర్దాక్షిణ్యంగా మైకులు క‌ట్ చేసింది.

ఆడ‌వారిని అసెంబ్లీలో అవ‌మానించినా అల‌క్ష్యం చేసింది.

వెకిలి న‌వ్వుతో వెట‌కారం చేసింది.

అహంకారంతో వెర్రి కేక‌లు వేసింది.

రెచ్చిపోయి ప‌చ్చ ఇజం చూపింది.

ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన ప్ర‌తిప‌క్షాన్ని పారిపోయారంటూ ప్ర‌చారం చేసింది

ఆ అనుభ‌వానికి ఇప్పుడు ఎదురుదెబ్బ త‌గిలింది.

ఆంధ్రాప్ర‌జ‌ల ఆయుధం దెబ్బ‌కు ఐదేళ్లు చ‌తికిల‌ప‌డింది.

నేడు ప్ర‌తిప‌క్షంలో నిల‌బ‌డ‌లేక‌, త‌డ‌బడుతూ, వ‌డివ‌డిగా అదే శాస‌న స‌భ‌ను వ‌దిలి వెళ్లిపోయింది..

40 ఏళ్ల అనుభ‌వం ఆరా తీద్దామ‌న్నా ఆచూకీ లేకుండా పోయింది. 

 

(న‌ల‌భై ఏళ్ల అనుభ‌వ‌మా నువ్వెక్క‌డ‌...ఆచ్చెంనాయుడితో క‌లిసి అసెంబ్లీ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు గారిని ఏపీ ఇప్పుడు ఇలాగే ప్ర‌శ్నిస్తోంది...)

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top