ఇంటి వ‌ద్దే మెరుగైన వైద్య సేవ‌లు

 జెడ్పీ చైర్మ‌న్‌, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు మ‌జ్జి నివాసరావు (చిన్న శ్రీను)

విజ‌య‌న‌గ‌రం: రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను ఇంటి వద్దే అందించడానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారర‌ని జెడ్పీ చైర్మ‌న్‌, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు మ‌జ్జి నివాసరావు (చిన్న శ్రీను) తెలిపారు. గరివిడి మండలం కోడూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం చేసిన అనంతరం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష  క్యాంపులో మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పాల్గొన్నారు.  క్యాంపులో అందుతున్న‌ వైద్య సేవల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని.. పేదవాడి ఆరోగ్యానికి ఎంత ఖర్చైనా భరిస్తుందని తెలుపుతూ.. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశార‌న్నారు.  జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించడానికి సుమారు ఐదు వేల మంది వైద్య నిపుణలను వినియోగిస్తున్నారని  తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ముందుగా రోగులను గుర్తించడం ప్రత్యేక వైద్య శిబిరాలు ద్వారా వారికి చికిత్సలు అందించడం వంటి మహత్తర కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. వైద్య సిబ్బంది రోగులను జల్లెడ పట్టి సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు విద్యార్థులకు వైద్య విద్యను అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే సారి 15 వైద్య కళాశాలలను మంజూరు చేయగా అందులో ఇప్పటికే 5 కళాశాలలను ప్రారంభించార‌ని చెప్పారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ భాస్కరరావు, జడ్పిటిసి వాకాడ శ్రీనివాసరావు, ఎంపీపీ ప్రతినిధి మీసాల విశ్వేశ్వరరావు, స్థానిక సర్పంచ్ గేదెల ఆదినారాయణ క్రిష్ణవేణి, ఎంపీటీసీ గపడి సన్యాసిరావు లక్ష్మీ, జెసిఎస్ మండల ఇంచార్జ్ పొన్నాడ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కొనిసి కృష్ణం నాయుడు, గేదెల శంకరరావు, సర్పంచులు, ఎంపీటీసీలు,  అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Back to Top