ఆటో ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన విద్యార్థుల‌కు వైవీ సుబ్బారెడ్డి పరామ‌ర్శ‌

విశాఖ‌:  విశాఖలోని సంగం శరత్‌ థియేటర్‌ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో-లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ప్రమాదంలో విద్యార్థులు హాసిని ప్రియా, జీ.గాయత్రి, వాణి జయ రమ్య, భవేష్‌, లక్ష్య, చార్విక్‌, కుశాల్ కేజీ, కేయూష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి విశాఖపట్నంలోని   సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో చికిత్స‌లు అందిస్తున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌, ప్ర‌జా ప్ర‌తినిధులు పరామ‌ర్శించారు.  పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాల‌ని డాక్ట‌ర్ల‌కు సూచించారు. 

Back to Top