ప‌ల్లెల్లో సంక్రాంతి క‌ళ క‌నిపించ‌డం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి

ప్రకాశం జిల్లా: ప‌ల్లెల్లో సంక్రాంతి క‌ళ క‌నిపించ‌డం లేదని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రైతుల మొఖాల్లో ఆనందం లేదు. రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలి. ఏడు నెలలైనా పింఛన్‌ తప్ప ఏం సంక్షేమ పథకం అమలు కాలేదు. చంద్రబాబు, పవన్ గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. హామీలు అమలు చేసి మాపై ఆరోపణలు చేయండి  అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

తిరుమల తొక్కిసలాట దురదృష్టకరమని ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే తమ పార్టీ తరఫున కోర్టుకెళ్తామని హెచ్చరించారు. లడ్డూ విషయంలో హంగామా చేసిన చంద్రబాబు, పవన్‌ ఎందుకు సెలైంట్‌గా ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. 

Back to Top