పవన్‌ ఎందుకు యాత్ర చేస్తున్నాడో ఆయనకే తెలియదు

వైయ‌స్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి

రాష్ట్రంలో జ‌రుగుతున్న‌ అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా?

విశాఖపట్నం: పవన్ క‌ళ్యాణ్ వారాహి యాత్ర ఎందుకు చేస్తున్నాడో ఆయనకే తెలియదని వైయ‌స్ఆర్‌సీపీ విశాఖపట్నం ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు.  శుక్రవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్రను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. పవన్‌.. ప్రజలకు ఉపయోగపడే ప్రయత్నం చేస్తే వారు పట్టించుకునేవారు అనుకుంటాను. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధి టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని ప్ర‌శ్నించారు. గత నాలుగేళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు. ఏడాది కాలంలో భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట ఎయిర్‌పోర్టు, రహేజా మాల్‌ నిర్మాణ పనులు టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని సుబ్బారెడ్డి నిల‌దీశారు. 

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపని చేసినా శిలాఫలకంవేసి వదిలేశారు. కానీ, నిర్ణీత కాలంలో ప్రతీ పని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తారు. విశాఖ అభివృద్ధితో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల విషయంపై కూడా అధికారులతో చర్చించినట్టు వెల్లడించారు. 

Back to Top