వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సంబ‌రాలు

తాడేప‌ల్లి:  బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం ప‌ట్ల తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో పార్టీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. బ‌ద్వేల్ ఉప ఎన్నిక 12వ రౌండ్లోనూ ‘ఫ్యాన్‌’ హవా కొనసాగింది. వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ 90,211 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అన్ని రౌండ్లలో కలిపి వైయ‌స్సార్‌సీపీ 1,11,849 ఓట్లు, బీజేపీ 21,638 ఓట్లు, కాంగ్రెస్‌ 6,223 ఓట్లు సాధించాయి. విజ‌యం ప‌ట్ల కేంద్ర కార్యాల‌యంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు, జోగి ర‌మేష్‌, పార్టీ నేత‌లు స్వీట్లు పంచుకొని శుభాకాంక్ష‌లు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top