మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జనసేన పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు 

నాగబాబు వ్యాఖ్యలను ఖండించిన వంగా గీత

కాకినాడ: మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జనసేన పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు చేశారని పిఠాపురం వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జనసేన నాగబాబు వ్యాఖ్యలను కూడా ఆమె ఖండించారు. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారనే ఆమె అన్నారు. 

వంగా గీత.. పిఠాపురం మండలం కుమరాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వంగా గీత మాట్లాడుతూ..నాగబాబు వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. నూటికి నూరు శాతం నాగబాబు వ్యాఖ్యలు కల్పితం. తనను కొడుతున్నారు.. తిడుతున్నారని చెప్పుకుని జాలి పొందాలనుకోవడం తప్పు. వారిని ఏదో చేసేస్తున్నారనే వ్యాఖ్యలు జనసేన నుండి వస్తున్నాయి. తమ పార్టీ ఎజెండా ఇది.. నియోజకవర్గంకు ఏదో చేస్తారో చెప్పడం లేదు. 

మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్‌ వ్యాఖ్యలు చేశారు. బ్లేడలతో దాడి చేస్తున్నారని రౌడీతత్వాన్ని పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టారు. ఇప్పుడు కడప నుంచి మనుషులు వచ్చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఏడాది కాలం నుంచి మిథున్‌ రెడ్డి మా పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్‌. నియోజకవర్గంలో పార్టీ సమస్యలు పరిష్కరించడానికి ఆయన వచ్చి వెళ్తారు. ప్రస్తుతం పిఠాపురంలో బయట వాళ్లు ఎవరున్నారని లెక్కలు చూస్తే అసలు విషయం తెలుస్తుంది. నాగబాబు వ్యాఖ్యలు పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టడం తప్పు అని వ్యాఖ్యలు చేశారు. 

 

Back to Top