విశాఖ గర్జన విజయవంతం చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు

విశాఖ‌: అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రేపు జరిగే విశాఖ గర్జనను విజయవంతం చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ ఉత్త‌రాంధ్ర రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖ రాజధానిగా ఉండకూడదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి దండయాత్రగా వస్తున్న రైతులకు శాంతియుత నిరసన తెలియజేయాలని ఈ ప్రాంత వాసులను సుబ్బారెడ్డి  కోరారు.  వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విశాఖపట్నం, కర్నూలుతోపాటు అమరావతిని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.  అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.  వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు తాము మద్దతు తెలియజేస్తున్నామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.   

ఉత్తరాంధ్ర ప్రజలు తమను నమ్మారని, అందువలన విశాఖ గర్జన విజయవంతం అయ్యే అవకాశం ఉందని సుబ్బారెడ్డి చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేశాం కాబట్టే ఈ ప్రాంత ప్రజల మద్దతును తాము కోరుకుంటున్నామని సుబ్బారెడ్డి చెప్పారు. అమరావతిపై కొంతమంది ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో ప్రజలు ఇప్పటికే గమనించారని ఆయన అన్నారు. ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో శాశ్వత రాజధానిని నిర్మించలేక పోయారని, ఆర్థిక వనరులను కూడా సక్రమంగా వినియోగించుకోలేక పోయారని ఆయన విమర్శించారు. 

 చంద్రబాబు  ఉత్తరాంధ్ర అభివృద్ది కాకుడదని కేవలం ఆ అమరావతి 24 గ్రామాలే  అభివృద్ది చెందాలని బలంగా కోరుకుంటున్నారని ఆరోపించారు.  రాబోయే తరాలకు అన్యాయం జరగకుండా ఉండాలని మూడు ప్రాంతాలు విడిపోయే ఆలోచన లేకుండా ముందు చూపుతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ వికేంద్రీకరణ చేస్తున్నారని అన్నారు. మళ్ళీ అమరావతే చుట్టూనే చంద్రబాబు లక్ష 10వేల కోట్లు అక్కడ పెడితే డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. శ్రీలంక లాగా అయిపోతుంది అంటున్నవ్ చంద్రబాబు... తింటానికి తిండి కూడా లేకుండా చేయాలనీ అనుకుంటున్నారని విమర్శించారు. మూడు ప్రాంతాల చుట్టూఅభివృద్ధి కాదని ఒకప్రాంత అభివృద్ధి చేస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల పరిస్థితి ఏమిటని ప్ర‌శ్నించారు.  

తాజా వీడియోలు

Back to Top