జైలుకు వెళ్తానని తెలిసే.. బాబు సింపతీ గేమ్‌!

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. రవిచంద్రారెడ్డి  

ఆంధ్రా చౌతాలా చంద్రబాబు

చంద్రబాబు చేసింది సాదాసీదా క్రైం కాదు. 

రూ.118 కోట్ల ముడుపుల ఐటీ నోటీసులు చాలా సీరియస్‌ క్రైం.

చంద్రబాబు అవినీతి సముద్రంలో ఇది ఒక నీటిబొట్టు మాత్రమే.

తండ్రీ కొడుకులు ఇద్దరూ జైలుకు వెళ్లడం ఖాయం

ఎన్నికలకు ముందే టీడీపీ టోటల్‌గా దివాళా.

ప్రశ్నిస్తే ప్యాకేజీ లెక్క బయటపడుతుందన్నది పవన్‌ భయం

పురందేశ్వరికి బంధుప్రీతి అడ్డమొస్తోంది. 

నారాయణ ఎక్కడ చికిన్‌ తింటున్నాడో తెలియదు. 

బాబుకు భజన చేసే పనిలో ఎల్లో సిండికేట్ జర్నలిజం

అందుకే బాబు అవినీతిపై వారెవ్వరూ ప్రశ్నించడం లేదు

తాడేప‌ల్లి: అమ‌రావ‌తి భూ దందాలో జైలుకు వెళ్తానని తెలిసే.. చంద్ర‌బాబు సింపతీ గేమ్ మొద‌లుపెట్టాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె. రవిచంద్రారెడ్డి విమ‌ర్శించారు. తాను ఎటువంటి అవినీతి చేసినా అది తనకు కనిపించదని చంద్రబాబు అనుకుంటాడు. ఆయన అపర ధృతరాష్ట్రుడు లాంటి వాడని అభివ‌ర్ణించారు. ఆయన వందిమాగధులు కూడా కళ్లకు గంతలు కట్టుకున్న గొప్ప వ్యక్తులు అన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఐటీ నోటీసులతో చంద్రబాబు విలవిలలాడుతున్నాడు:
-ఐటీ నోటీసుల విషయంలో చంద్రబాబు గిలగిలా కొట్టుకుంటూ విలవిల్లాడుతున్నాడు. 
-ఐదు రోజులుగా చంద్రబాబు, ఆయన తనయుడు, ఎల్లో మీడియా అంతా ఎక్కడి దొంగలు అక్కడే .. అన్న చందంగా ఉన్నారు. 
-తమ మీడియాలోనే కాకుండా ఇతర మీడియాల్లోనూ ఆ వార్తలు రాకుండా మేనేజ్ చేయడం అత్యంత జుగుప్సాకరం. 
-ఎల్లో సిండికేట్‌ జర్నలిజాన్ని.. వ్యాపార సిండికేట్‌గా మార్చుకుని బాబుకు భజన చేస్తున్నారు. 
- చంద్రబాబు వెన్నుపోటు పొడిచినా, ఓటుకు కోట్లు కేసైనా, అమరావతి స్కాం, ఐటీ స్కాం ఏదైనా ఎలా కవరప్‌ చేయాలా అనే ప్రయత్నంలో ఎల్లో మీడియా ఉంటుంది.  
-తాను ఎటువంటి అవినీతి చేసినా అది తనకు కనిపించదని చంద్రబాబు అనుకుంటాడు. ఆయన అపర ధృతరాష్ట్రుడు లాంటి వాడు. 
-ఆయన వందిమాగధులు కూడా కళ్లకు గంతలు కట్టుకున్న గొప్ప వ్యక్తులు. 
-ఈ గాంధారుల లిస్టులో మొదటి వాడు రామోజీరావు. రెండోవాడు రాధాకృష్ణ, మూడోవాడు టీవీ5 నాయుడు, మిగతా స్థానాల్లో దత్తపుత్రుడు, పురందేశ్వరి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అంతా ఉన్నారు. 
-మాకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియాతో సమస్య లేదు కానీ చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియాగా మారిన రామకృష్ణ, నారాయణలతోనే సమస్య. 

ఇది చంద్రబాబు అవినీతి సముద్రంలో ఒక నీటి బొట్టే:
-చంద్రబాబుకు అవినీతి కొత్త కాకపోయినా ఇది సాదాసీదా క్రైం కాదు. 
- అమరావతిలో పేదలకు ఇళ్ల నిర్మాణం, హైకోర్టు నిర్మాణం పేరుతో రూ.118 కోట్ల ఐటీ నోటీసులు చాలా సీరియస్‌ క్రైం.
- ఇది చంద్రబాబు అవినీతి సముద్రంలో ఒక నీటిబొట్టు మాత్రమే. 
- ఐటీ నోటీసుల్లో 4 పేజీలు చదివే సరికే వీళ్లకు తడచిపోతోంది. 
- అప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతూ చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 
- రెండు మూడు రోజుల్లో అరెస్టు అయ్యే అవకాశం ఉందని హింట్‌లు ఇస్తున్నాడు. 
- అప్పుడైనా అరెస్ట్‌ చేయరేమోనని ఆయన ఆశ..అలాంటి మొహమాటాలు ఏవీ ప్రభుత్వాలకు- చట్టాలకు ఉండవు. 
- నువ్వు వృద్ధుడువని వదిలేయదు... ఎవ్వరు తప్పు చేసినా వదిలే పరిస్థితి ఉండదు. 
- చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. 

ప్యాకేజీ లెక్కలు బయటపడతాయనేనా..?:
- పవన్‌ కల్యాణ్‌...మీరు ఎక్కడ బాబూ..? మాయమై పోయారు...పత్తా లేకుండా పోయారు..మీ ట్విట్టర్‌ కూడా మూగబోయింది. 
- బాబును ప్రశ్నిస్తే నీ ప్యాకేజీ లెక్కలు బయటపడుతుందని భయమా..? 
- పురంధేశ్వరి.. బాబుకు రూ. 118 కోట్ల ముడుపులకు సంబంధించి ఐటీ నోటీసులు ఇస్తే, మీకు ఇది సాధారణ విషయంగా ఎలా కనిపిస్తోంది..? 
- పేద ప్రజల సొమ్ము తినేస్తే.. బాబు అవినీతికి మీ బంధుప్రీతి అడ్డమొస్తుందా..? 
- కాంగ్రెస్‌ ఉందో లేదో తెలియదు..సీపీఐ నారాయణ ఎక్కడ చికెన్‌ తింటున్నాడో తెలియడం లేదు. 
- మాకు ఇవేం కనపడవు..వినపడవు అంటూ ఒక్క వార్త రాయని పచ్చ మీడియాకు అసలు సిగ్గనిపిండటం లేదా? 

ఆంధ్రా చౌతాలా చంద్రబాబుః
- ఈ నోటీసులు కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు బాబు అవినీతి చిట్టా మరింతగా బయటకు వస్తుంది. 
- వీటి నుంచి డైవర్ట్‌ చేసేందుకే లోకేష్ యువగళం యాత్రలో రౌడీలకు ఎర్ర టీ షర్టులు వేయించి,  భీమవరంలో శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు. 
- రాబోయే రోజుల్లో కఠినమైన శిక్షలకు మీరు సిద్ధంగా ఉండండి. 
- తండ్రీ కొడుకుల మీద ఉన్న సాక్షాధారాలను బట్టి మీకు అరెస్ట్‌ తప్పదు. 
- ఆంధ్రా చౌతాలా చంద్రబాబూ... జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండండి. 
- బయటకు వచ్చిన అవినీతికి..  దాదాపు పదేళ్లు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు... అక్కడే మీ శేషజీవితం సరిపోతుందేమో..? 
- టీడీపీ అనే పార్టీ టోటల్‌గా దివాళా తీసిన పార్టీ. 2024 తర్వాత అది ఉండదు. 
- చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసింది అవినీతే.. అభివృద్ధి ఎప్పుడూ చేయలేదు. పైగా, అడ్డగోలుగా దబాయింపు చేస్తున్నారు. 
- లోకేశ్‌ రాసి పెట్టుకోవాల్సింది.. ఎర్రబుక్‌ లో కాదు..ఎల్లో బుక్‌ లో.. 
- తండ్రీ కొడుకులు ఇద్దరూ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. 
- 2024 ఎన్నికలకు ముందే టోటల్‌గా దివాళా తీసే పార్టీ టీడీపీ. 

Back to Top