తాడేపల్లి: వైయస్ జగన్‌పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమని సీఎం గారిపై దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆ ప్రెస్‌నోట్ లో చంద్రబాబు ఆందోళన చేందుతున్నారు. పోలీసు అధికారులు వైయస్ఆర్‌సీపీ ప్రమేయంతో పనిచేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చాడు. కచ్చితంగా మీరు దొరికిపోయారని, మీరే ఈ దాడి చేయించారని చెప్పకనే చెప్తున్నారని అన్నారు. బుధవారం వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రవిచంద్రారెడ్డి ఏమన్నారంటే.. *నీ వరకూ వస్తుందని భుజాలు తడుముకుంటున్నావా బాబూ?:* – చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. – టీడీపీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమని సీఎం గారిపై దాడి కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఆ ప్రెస్‌నోట్ లో చంద్రబాబు ఆందోళన చేందుతున్నారు. – పోలీసు అధికారులు వైఎస్సార్సీపీ ప్రమేయంతో పనిచేస్తున్నారని దుర్మార్గమైన స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చాడు. – చంద్రబాబూ...ఇంత వరకూ పోలీసులు ఎటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. – వారి దర్యాప్తు గురించి కానీ, ఎవరిని విచారిస్తున్నారన్న విషయం కానీ, ఎవరి పేర్లు అందులో ఉన్నాయన్నది ఏదీ పోలీసులు ఇంకా చెప్పలేదు. – అలాంటప్పుడు మీకు ఏం సమాచారం ఉండి ఇలాంటి ప్రెస్ రిలీజ్ ఇచ్చారో సమాధానం చెప్పాలి. – అధికారికంగా చంద్రబాబు ఇలాంటి ప్రెస్‌నోట్ ఇస్తున్నారంటే మీరు భుజాలు తడుముకుంటున్నట్లు అర్థం కావడంలేదా? – కచ్చితంగా మీరు దొరికిపోయారని, మీరే ఈ దాడి చేయించారని చెప్పకనే చెప్తున్నారు. – మీరు గుంటూరు దాటిన తర్వాత జగన్ గారి బస్సు యాత్రకు క్రేజ్ తగ్గుతుందని భావించారు. – కానీ గుంటూరు నుంచి విజయవాడ వచ్చే సరికి కృష్ణా వారధి పోటెత్తడంతో పాటు విజయవాడ జనసంద్రంగా మారింది. – ఆ జన ప్రవాహాన్ని చూసి ఓర్చుకోలేక మీరే ముఖ్యమంత్రి గారిపై దాడి చేశారని ఖచ్చితంగా అర్థం అవడం లేదా? – మీరే చెప్తున్నట్లు, ఈ దాడి వెనక బోండా ఉమ ఉన్నట్టు మీరు చెప్తున్నారంటే... చివరకు ఈ కేసు మీ వరకూ వస్తుందని భయపడుతున్నారా చంద్రబాబు? – వాళ్ల స్పందన చూస్తే అసలు దొంగ చంద్రబాబేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. – తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని బాబు భయపడుతున్నాడా అనే సందేహం కలుగుతోంది. – అసలు చంద్రబాబుకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? – ముందు జాగ్రత్త కోసం దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా అరుస్తున్నాడు. – ఖచ్చితంగా ఈ దాడి చేయించింది చంద్రబాబే అనేది వారి స్పందన చూస్తే తెలుస్తోంది. – ఇప్పటికే వస్తున్న సమాచారం మేరకు బోండా ఉమా ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశారని తెలుస్తోంది. *బోండా ఉన్నాడో.. బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు బాబూ?:* – పోలీసులు ఎవరు అధికారికంగా విచారణపై నోరెత్తకపోతే ఏ బోండా ఉన్నాడో..ఏ బజ్జీ ఉన్నాడో మీకెలా తెలుసు చంద్రబాబు? – జగన్ గారి యాత్ర గుంటూరు, విజయవాడలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో జన గోదారి అయ్యాయి. – దీంతో బెంబెలెత్తిపోయి, ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. – మీరు చేస్తున్న యాత్రలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. – మీరు, పవన్, పురందేశ్వరితో కలిసి చేస్తున్న యాత్రలు ఏ విధంగా ప్లాప్ అవుతున్నాయో మీకు తెలుసు. – అందుకే మీ ఓర్వలేని తనం అడుగడుగునా కన్పిస్తోంది. – బాలకృష్ణ యాత్ర కర్నూలు జిల్లాలో జనం లేక వెలవెల పోయింది. – మీ ఉత్త పుత్రుడు నారా లోకేశ్ ఏ సభకూ పనికిరాడని మీరే పక్కన పెట్టారు. – మీ దత్తపుత్రుడు ఫ్రస్టేషన్ ఎక్కువై తెనాలిలో పూనకం వచ్చినట్లు ఊగిపోవడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. – అతనేమన్నా మత్తు మందుకు బానిస అయ్యాడా, లేక మందు సేవించి అలా ప్రవర్తిస్తున్నాడా అనే అనుమానాలున్నాయి. – మీ కూటమి పూర్తిగా విఫలమైందనేది వీటన్నిటి బట్టి తెలుస్తోంది. *మీలో అణువణువునా ఫ్రస్టేషన్ కనిపిస్తోంది:* – మీకు అణువణువునా టెన్షన్, ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారు. – మీ మాయాకూటమిలో ఉన్నది దుష్టచతుష్టయం. – కుట్రలే ఎజెండాగా ఏర్పడిన ఈ కూటమి భవిష్యత్తు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెల్లారిపోతుంది. – రామోజీ మార్గదర్శి అక్రమాల కేసులలో పీకల్లోతులో మునిగి ఉన్నాడు. ఇదే ప్రభుత్వం మళ్లీ వస్తే ఉనికి గల్లంతు అవుతుందని భయం. – రాధాకృష్ణ, బీఆర్‌నాయుడులకు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని భయంతో ఉన్నారు. – అందుకే, నిత్యం నెగిటివ్ న్యూస్ ద్వారా అధికారం సాధించాలనే ఎత్తుగడ మీది. – కానీ జగన్ గారు ముఖ్యమంత్రిగా 99 శాతం హామీలు అమలు చేసి, 2.70 లక్షల కోట్లు దళారీలు లేకుండా డిబిటీ ద్వారా ప్రజలకు అందించారు. – జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా చేసి, నేను చేసిన మేలు మీకు చేరిఉంటేనే నాకు ఓటేయమని అడుగుతున్న రియల్ హీరో జగన్‌గారు. – ప్రతి గడపకూ సేవలందించిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం. – మీరు చెప్పుకునేందుకు ఏమీ లేక చేతులెత్తేసిన మీరు ఈ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తూ ఓట్లడగడానికి సిగ్గుగా లేదా? *జూన్4కి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీ:* – ఇప్పటికే టీడీపీ అంటే టోటల్‌గా దివాళా తీసే పార్టీ అయింది. – జూన్4 మధ్యాహ్నానికి టీడీపీ అంటే తూర్పు తిరిగి దండం పెట్టే పార్టీగా మిగలనుంది.