పోసాని మురళి అరెస్టును ఎవ‌రు హర్షించరు 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పోతిన మ‌హేష్‌

విజ‌య‌వాడ‌: పోసాని మురళి అరెస్టును వైయ‌స్ఆర్‌సీపీ(ysrcp)నే కాదు రాష్ట్ర ప్రజలు ఎవ‌రు కూడా హర్షించరని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పోతిన మ‌హేష్ అన్నారు. పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అరెస్టుపై ఆయ‌న స్పందించారు. మీడియాతో గురువారం మ‌హేష్ మాట్లాడుతూ..`కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టకుండా పగతో,  ప్రతీకారంతో  రెడ్ బుక్(Red Book) రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజకీయాలు మాట్లాడ‌న‌ని చెప్పిన పోసానిని పండగ పూట ఇంటికి వెళ్లి బలవంతంగా అరెస్ట్ చేశారు. ఎటువంటి నోటీసులు సర్వ్ చేయకుండా, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా అరెస్ట్ చేశారు. పోసాని మురళి అరెస్టును ఎవ‌రు హర్షించరు. ప్రజాస్వామ్యం పనికిరాదు నియంతృత్వమే ఉండాలి అనే విధంగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అరెస్ట్ కంటే  పోసానిని దారుణంగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు నాటి మహిళా మంత్రులని బూతులు తిట్టారు.  రాష్ట్రంలో నిరంకుశ‌త్వ పాలన కొనసాగితే, అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే, ప్రజల చేతుల్లో కూటమి ప్రభుత్వం చావు దెబ్బతింటుంది` అంటూ పోతిన మ‌హేష్(Pothina Mahesh) హెచ్చ‌రించారు.

Back to Top