చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులు..

అదే చట్టం ముందు నిలబడక తప్పదు 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్‌ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హెచ్చ‌రిక‌

వ్యవస్థీకృత రాజకీయ నేరాల సృష్టికర్త చంద్రబాబు

సెక్షన్‌ 111కు వక్రీకరణలు, తప్పుడు భాష్యాలు

మీ అన్యాయంపై గొంతెత్తితే తప్పుడు సెక్షన్‌ పెడతారా?

దీనికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు 

నారా లోకేష్‌ ఇప్పటికీ విష ప్రచారాలు చేస్తున్నారు

మేమే స్వయంగా ఫిర్యాదు చేస్తాం. కేసులు పెడతారా

చర్య తీసుకుని అరెస్టు చేస్తారా?

అమ్మను చంపాలని చూశాడంటూ వైయ‌స్‌ జగన్‌పై విమర్శ

ఆ దుష్ప్రచారం శిక్షార్హం కాదా? అందుకు టీడీపీపై చర్యలు తీసుకోరా? 

సూటిగా ప్రశ్నించిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ. దారుణ అణిచివేత

వాస్తవ ఎమర్జెన్సీలోనూ ఇన్ని అరాచకాలు జరగలేదు

రాష్ట్రంలో మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా చంద్రబాబు గుప్పిట్లో

వ్యతిరేకంగా ఉన్న ఛానళ్లను కేబుల్‌ టీవీల్లో కట్‌ చేయించారు

ఇప్పుడు సోషల్‌ మీడియాను కర్కషంగా అణిచివేసే ప్రయత్నం

ఆ దిశలోనే వందల కేసులు. వేల నోటీసులు. కస్టడీ టార్చర్లు 

టీడీపీ చేస్తోంది ఒక ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌. అది వ్యవస్థీకృత నేరం

ఐటీడీపీ ఒక ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ సిండికేట్‌ కాదా?  

పోలీసులు చట్టానికి అతీతులు కారన్నది మరవొద్దు

ప్రెస్‌మీట్‌లో పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

తాడేపల్లి: చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులు..అదే చట్టం ముందు నిలబడక తప్పదని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్‌ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హెచ్చ‌రించారు. వారితో ఆ పని చేయించిన నేతలెవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు. సుధారాణి కస్టోడియల్‌ టార్చర్‌ ఎపిసోడ్‌ ఒక కేస్‌ స్టడీ అన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (లీగల్‌ వ్యవహారాలు) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

సోషల్‌ మీడియాపై కక్ష:
    ఒక నియంత పాలనలో ఉన్న దేశం కంటే, అధ్వాన్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయని ఈ ప్రభుత్వం, చేతులెత్తేసి, దాన్నుంచి ప్రజలదృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోంది. దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మీడియాది. అది ప్రజాపక్షాన నిలబడి దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాల్సి ఉంది.
    కానీ, దురదృష్టవశాత్తూ ఇక్కడ మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా చంద్రబాబుకు దాసోహం అయి, ఆయనకు రోజూ వంత పాడుతోంది. దీంతో వాస్తవాలు ఎత్తి చూపుతూ, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న మీడియాను ప్రభుత్వం అణిచివేయాలని చూస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా, కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా ఆ ఛానళ్లు ప్రసారం కాకుండా చూశారు. కానీ, ఒక్క సోషల్‌ మీడియా మాత్రం తన అదుపులో లేకపోవడంతో, కర్కషంగా వ్యవహరిస్తూ, దాన్నీ అణిచివేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎందుకంటే అది వ్యవస్థీకృత విధానంలో లేదు. సోషల్‌ మీడియా తనకు కొరగాని కొయ్యగా మారిందని భావిస్తున్న సీఎం చంద్రబాబు, టార్గెట్‌ చేసి, దారుణంగా వేధిస్తున్నారు.

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ:
    మీడియా మిత్రులు ఒక్కసారి గమనించండి. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సెక్టర్‌ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఆ దిశలోనే కొన్ని వందల మందిని అరెస్టు చేసి, కొన్ని వేల మందికి నోటీసులు ఇస్తోంది. ఇది ఎమర్జెన్సీ సమయంలో కూడా జరగలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది.
    తన తప్పులను ఎత్తి చూపుతున్న, హామీలను నిలబెట్టుకోలేని వైనాన్ని ప్రశ్నిస్తున్న వారిని పోలీసు బూట్లతో తొక్కించాలని చూస్తున్నారు.
ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. అందుకే ఇంత నిరంకుశత్వం. ప్రజల సమస్యలు ఎత్తి చూపుతున్న సోషల్‌ మీడియాను అణిచివేయాలని చూస్తున్నారు.

సెక్షన్‌–111 కింద కేసు అతి దారుణం:
    ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే చర్యలకు ఇప్పటికే భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) సెక్షన్లు ఉండగా.. కొత్తగా 111 సెక్షన్‌ను యాడ్‌ చేశారు. 246వ పార్లమెంటు కమిటీ ఆఫ్‌ హోం ఎఫెయిర్స్‌ దాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, పాస్‌ చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు కిడ్నాపింగ్, ల్యాండ్‌ గ్రాబింగ్, కాంట్రాక్ట్‌ కిల్లింగ్, ఎక్స్‌ట్రాక్షన్, బ్యాంక్‌ ఫ్రాడ్స్‌ వంటి నేరాల అదుపునకు సరిపోవు కాబట్టి, కొత్తగా బీఎన్‌ఎస్‌ చట్టంలో 111 సెక్షన్‌ను తీసుకొచ్చారు.
    ఇప్పుడు రాష్ట్రంలో దాన్ని సోషల్‌మీడియా కార్యకర్తలపై ప్రయోగించారు. ఇంతకన్నా నియంతృత్వ ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? 
ప్రశ్నించే గొంతులపై ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా ఆ సెక్షన్‌ను ప్రయోగిస్తున్నారా? 

చంద్రబాబు శ్రీరంగ నీతులు:
    అదే చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారో వినండి.. అంటూ ఆ వీడియో ప్రదర్శించి చూపారు.
    ‘సోషల్‌ మీడియాలో ఎవరైనా తప్పు చేశారని భావిస్తే, విచారణకు ముందు 41–ఏ నోటీస్‌ ఇవ్వాలని స్పష్టంగా చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరినైనా అరెస్ట్‌ చేయడానికి పోయినప్పుడు, పోలీసులు తప్పనిసరిగా యూనిఫామ్‌లో ఉండాలని, వారి పేర్లు ప్రదర్శించాలని కూడా ఉంది’.
    మరి అప్పుడు ఇన్ని శ్రీరంగనీతులు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో చూడాలన్న పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఒక ఘటనను ప్రస్తావించారు.

సుధారాణి. కస్టోడియల్‌ టార్చర్‌:
    సుధారాణి అనే సోషల్‌ మీడియా కార్యకర్త, తన భర్తతో కలిసి సిరిసిల్లలో టూవీలర్‌పై వెళ్తుంటే, ఈనెల 4న అరెస్ట్‌ చేసి తీసుకొచ్చిన పోలీసులు.. ఆమెను నాలుగురోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. నాలుగు పోలీస్‌స్టేషన్లు తిప్పి, ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, ఏడుగురు ఎస్‌ఐలు, 200 మంది పోలీసులను అందు కోసం వాడారు. ఆమె బిడ్డలను కూడా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. వారి ముందే తల్లిదండ్రులను హింసించారు.
    చట్టం ముందు అందరూ సమానం కదా? మరి సుధారాణి పట్ల అంత దారుణంగా వ్యవహరిస్తారు?

ఒట్టేసి చెబుతున్నా.. ఇది తథ్యం:
    ఒట్టేసి చెబుతున్నా. న్యాయదేవత మీద ఒట్టేసి చెబుతున్నా. ఒక జగనన్న సైనికుడిగా చెబుతున్నా. 40 ఏళ్ల న్యాయవ్యవస్థలో న్యాయ నిపుణుడిగా చెబుతున్నా, ఒక ప్రజాస్వామ్యం మీద అచంచల విశ్వాసంతో చెబుతున్నా, రాజ్యాంగం మీద, న్యాయస్థానాల మీద ఉన్న విపరీతమైన గౌరవంతో మళ్లీ చెబుతున్నా..
    దీనికి (సుధారాణి కస్టోడియల్‌ టార్చర్‌) బాధ్యులైనటు వంటి పోలీస్‌ ఆఫీసర్స్, ఆమెను హింసించిన మొత్తం టీమ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌.. ఎందుకు చేశామా ఈ పని? ఎవరి ప్రోద్భలంతో చేశామా ఈ పని? అని కచ్చితంగా మీరు ఫీలయ్యే రోజు వస్తుంది. రాకుండా వదలము. ఇది గ్యారెంటీ. ఇదొక కస్టోడియల్‌ టార్చర్‌. ఆ టార్చర్‌కు ఇది ఉదాహరణ. కేస్‌ స్టడీ అవుతుంది.
    ‘సుధారాణిని తెల్లవారుజామున 4 గం.కు రిమాండ్‌ చేశారు. మొత్తం నాలుగు పీఎస్‌లు, ముగ్గురు డీఎస్పీలు, నాలుగు పీఎస్‌ల ఎస్‌హెచ్‌ఓలు, ఇద్దరు ఎస్పీలు, 200 మంది పోలీసులు.. సుధారాణిని హింసించిన ప్రక్రియలో భాగస్వాములు. అంత మంది కలిసి ఆమెను హింసించడానికి ఆమె ఏమైనా టెర్రరిస్టా?.

ఆమె జైలే పదిలం అనుకునేలా..!:
    ఒకవేళ సుధారాణి రిలీజ్‌ అయితే మళ్లీ అరెస్ట్‌ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వ్యాన్లలో 200 మంది పోలీసులు వచ్చారు. కోర్టు బెయిల్‌ ఇస్తే, మళ్లీ లిఫ్ట్‌ చేయడానికి వచ్చారు. దీంతో ఆమె భయపడి, బెయిల్‌ పిటిషన్‌ కూడా వేయలేదు. పోలీసులను చూసి ఆమె అంత భయపడ్డారు. కనీసం జైలులో అయినా బతకొచ్చు అనుకున్నారు.
    అంటే రాష్ట్రంలో బతికేకన్నా, జైలు పదిలం. అని ఒక్కొక్కరు అనుకుంటున్నారంటే, పరిస్థితి ఎంత దారుణమో చూడండి.

ఇది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కాదా?:
    ఇది ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా? ఎంత కాలం మీరు ప్రజావాణిని నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు? ఇది మీరు చేస్తున్న ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ కాదా? ఇది చంద్రబాబు చేసే ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ కాదా? మీ ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలు  చేసే ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ కాదా? వ్యవస్థల్లో మీ మనుషుల చేసే ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ కాదా?. మరి ఇది సెక్షన్‌ 111 కింద రాదా?
    ఇంకా విచిత్రం. ఎన్టీఆర్‌ జిల్లా. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో కంటెంట్‌ ద్వారా చేయకూడనివి అంటూ, ఒక ప్రకటన జారీ చేశారు. కులమతాల మధ్య విద్వేషాలు పెట్టకూడదని చెప్పారు.
    మరి ఈ మ«ధ్యే చూశాం. అత్యున్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకుడు కుల, మతాలు రెచ్చగొట్టలేదా? ఇది దీనికి వ్యతిరేకం కాదా?
తప్పుడు సమాచారం పెట్టడం కూడా ఈ చట్టం ప్రకారం నేరం. మా పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అదే నేరం మోపారు.

కమిషనర్‌గారూ చూడండి.. చర్య తీసుకుంటారా?:
    ఈరోజు (శనివారం) సాయంత్రం, టీడీపీ అఫీషియల్‌ ట్విటర్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు.     ‘తాడేపల్లి కొంపలో జగన్‌ జల్సాలు. పెన్ను, పేపర్‌ ఖర్చు కోసం రూ.9.84 కోట్లు ఖర్చు చేశారని’. మరి ఇది నిజమా? తప్పుడు సమాచారం కాదా? ఆడిట్‌ రిపోర్ట్స్‌ చూశారా? బడ్జెట్‌ అలకేషన్‌ చూశారా? ఇది పూర్తిగా తప్పుడు సమాచారం కాదా?
    ఇంకా ఎగ్‌ పఫ్‌ల కోసం రూ.3.62 కోట్లు, ఎలుకలు పట్టడం కోసం రూ.1.36 కోట్లు ఖర్చు పెట్టారని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇది తప్పుడు సమాచారం కాదా? జగన్‌ సెక్యూరిటీ కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టారా? ఇవన్నీ తప్పుడు సమాచారం కాదా? అది టీడీపీ ట్విటర్‌లోనే పోస్ట్‌ చేశారు.
    మరి ఇది నేరం కాదా సీపీగారు చెప్పండి. రేపు వచ్చి నేను ఫిర్యాదు చేస్తాను. చర్య తీసుకుంటారా? చంద్రబాబును లోపల వేస్తారా?. మీకు ఆ ధైర్యం ఉందా? గొంతులేని వాళ్లను బూటు కాళ్ల కింద తొక్కారు. కేసు పెట్టారు. 
    నేను స్వయంగా వచ్చి ఫిర్యాదు చేస్తాను. టీడీపీపై చర్య తీసుకుంటారా? ఇది సెక్షన్‌ 111 కిందకి రాదా? తప్పుడు సమాచారం అయినప్పుడు చర్య తీసుకునే ధైర్యం ఉందా? రాజ్యాంగం ముందు అందరూ సమానమే కదా? 14వ అధీకరణం ప్రకారం చట్టం ముందు అందరూ సమానం కదా?
    మీరు చెప్పారు. సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం పోస్టు చేస్తే, లోపల వేస్తామన్నారు. ఈ సాయంత్రం టీడీపీ అంత పచ్చిగా తప్పుడు సమాచారం పోస్టు చేస్తే, మేము ఫిర్యాదు చేస్తే, చర్య తీసుకుంటారా? లేదా?
    ఇంకా రెండేళ్ల విజయమ్మగారి కారు టైర్లు బరస్ట్‌ అయితే, అది ఇప్పుడు జరిగిందని. ఆ విధంగా జగన్‌గారు తన తల్లిని చంపాలని చూశారని పోస్ట్‌ చేశారు. అది నిజం కాదని విజయమ్మగారు ప్రకటిస్తే, దాన్నీ ఫేక్‌ అన్నారు. దీంతో ఆమె చివరకు వీడియో రిలీజ్‌ చేశారు.
మరి అలా తప్పుడు సమాచారం పోస్ట్‌ చేసిన టీడీపీపై మీరు ఏం చర్య తీసుకుంటారు?. టీడీపీకి ఆ చట్టం వర్తించదా?

లోకేష్‌ ట్వీట్‌ కూడా చూడండి:
    ఇంకా కొన్ని గంటల ముందు లోకేష్‌ తన పర్సనల్‌ ట్టిటర్‌లో మధ్యాహ్నం 2.15కు ఒక పోస్ట్‌ చేశారు. ‘విద్యార్థులను నేను అడుగుతున్నాను. మీ పెన్‌ ఎంత ఖరీదు అవుతుంది? అదే జగన్‌ తన ప్యాలెస్‌లో పెన్‌ల కోసం ఏకంగా రూ.9.84 కోట్లు ఖర్చు పెట్టారు’.. అని లోకేష్‌ పోస్ట్‌ చేశారు.
    ఇది కూడా తప్పుడు సమాచారం కాదా? బీఎన్‌ఎస్‌ చట్టం 111 సెక్షన్‌ ప్రకారం చర్య తీసుకుంటారా? మేము ఆధారాలు చూపుతున్నాం. ఫిర్యాదు కూడా చేస్తాం. నిజానికి మీరు సుమోటోగా కేసు రిజిస్టర్‌ చేయొచ్చు. ఆ విధంగా అందరికీ ఒకే చట్టం అని చూపండి. 
ఇంకా ఏం రాశారు? తాడేపల్లిలో విధ్వంస ప్లాన్‌లు గీసేందుకు పెన్‌ల కోసం రూ.9.84 కోట్లు ఖర్చు చేశారని కూడా రాశారు.

ప్రజాస్వామ్యం ఉండదు:
    ఈరోజు మీరు చేస్తోంది పూర్తిగా చట్టవిరుద్ధం. వేల మందిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. చిత్రహింసలు పెడుతున్నారు. ఇదే కొనసాగితే ప్రతి పాలకుడు ఒక నియంత అవుతాడు. చట్టాలను అతిక్రమించి, ప్రశ్నించే గొంతులు నొక్కేస్తారు. ప్రతి పాలకుడు రాక్షసుడైతే, ప్రజాస్వామ్యం ఉండదు.

గతి తప్పిన మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా:
    ఇంకా మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో ఏం రాశారు? ఒకసారి చూడండి. ‘వైకాపా సోషల్‌ మీడియా ఉన్మాదుల కర్మాగారం’ అని రాశారు. మరి అది నిజమైతే, మీరు పరిశుద్ధ ఆత్మలా?. 
    మీకు వంత పాడే మీడియా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే దాదాపు మొత్తం మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా మీ చేతుల్లో ఉంది. 
ఏదో మిగిలిన మీడియా కొంత ఉంటే, దాన్ని కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా కట్‌ చేయించారు కదా? ఇక మిగిలిన సోషల్‌ మీడియాను కూడా ఇలా కట్టడి చేయాలని అనుకుంటున్నారా? కానీ, ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి.
బాధ పడ్డ ప్రజలు దేన్నీ మర్చిపోరు. కేవలం అధికారం కోసమే కదా? మీరు ఇదంతా చేస్తోంది.

జనం భయంతో పారిపోతున్నారు:
    ఈ విధంగా ప్రజల గొంతు నొక్కడం ఎంత వరకు సబబు? మీ వల్ల మోసపోయిన ప్రజల్లో మీ పట్ల వ్యతిరేకమే ఉంటుందా? సోషల్‌ మీడియాలో ప్రశ్నించిన వారిపై సెక్షన్‌ 111 కింద కేసు పెడతారా? మరి మీరు తప్పు చేశారు కదా? తప్పుడు సమాచారం పోస్ట్‌ చేశారు కదా? మీపైనా అదే సెక్షన్‌ కింద కేసు పెట్టాలి కదా?
    వారు నిజంగా తప్పు చేసి ఉంటే, చట్టాలు ఉన్నాయి. కానీ మీరు ఆ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. వేల కుటుంబాలను వేధిస్తున్నారు. వారు పారిపోతున్నారు. అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. 
    పాలకులు చెప్పినట్లు నడుచుకుంటూ, పోలీసులు వ్యవహరించి, హింస పెట్టిన వారికి మళ్లీ చెబుతున్నా.. కస్టోడియల్‌ టార్చర్‌ చేసిన వారు బాధ పడతారు. ఇది వాస్తవం. ఆరోజు ఈ పాలకులు మీకు కనబడరు.

ఐటీడీపీ ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ సిండికేట్‌:
    ఐటీడీపీ పెట్టి, దాని ద్వారా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నారు. అది ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ సిండికేట్‌ కాదా? ఏ నాయకుడు మాట్లాడినా, ఏం చెప్పినా, క్షణాల్లో వందలు, వేల పోస్టులు చేస్తున్నారు.
    కాబట్టి, అవన్నీ పోలీసులకు చూపుతాం. వారు కేసు పెట్టకపోతే, చట్టపరంగా చర్యలకు దిగుతాం. పోలీసులు చట్టానికి అతీతులు కారన్న విషయం మర్చిపోకండి అని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top