తాడేపల్లి: కేసులు విచారణకు రాకుండా అడ్డుకోవడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు . స్కిల్ స్కామ్‌లో సుధీర్ఘకాలం దర్యాప్తు జరిగాకే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. లేని ప్రాజెక్టులు ఉన్నట్లు చూపించి ప్రజాధనం దోచేశారు. సాక్షులను చంద్రబాబు దేశాలను దాటించగలడు. పెండ్యాల శ్రీనివాస్, పార్థసాని ఇద్దరూ రాత్రికి రాత్రే దేశం వదిలి పారిపోయారు. ఐటీశాఖకు చంద్రబాబు పరిధులు చెబుతున్నారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణకొచ్చారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని మండిపడ్డారు. సీమెన్స్ సంస్థ సైతం మాకు సంబంధం లేదని చెప్పిందని తెలిపారు.రూ. 300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు. అన్ని ఆధారలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఫేక్ ఇన్వాయిస్‌తో నిధులు పక్కదారి పట్టించారు. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. ఈడీ కూడా నలుగురిని అరెస్ట్ చేసింది. రూ. 300 కోట్లు జేబులో వేసుకోవడానికే స్కిల్ కుట్ర. ఈ స్కామ్‌కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే. చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు అయిన తరువాత సుదీర్ఘ వాదనలు రెండు పక్షాలు విన్న తరువాత కోర్టు ఆ స్కామ్ జరిగిందని ప్రాథమికంగా సాక్షాధారాలు ఉన్నాయని నమ్మి రిమాండుకు పంపి నెల రోజులు అవుతుంది. ఈ దశలో ఆ రోజు నుంచి మొదలుపెడితే మొత్తం కోర్టులను వేదికలుగా చేసుకొని, బయట చంద్రబాబు న్యాయవాదులు,ఆ పార్టీ రాజకీయంగా రోడ్ల మీదకు వచ్చినా, మీడియా ముందుకు వచ్చినా ఒకే ఒక అంశంపై వెళ్తున్నారు. చంద్రబాబును ప్రోటోకాల్ ప్రకారం అరెస్టు చేయలేదని పేర్కొంటున్నారు. రాజకీయంగా కక్షసాధింపుతో అరెస్టు చేయించారని మాట్లాడుతున్నారు. వారు మాట్లాడుతున్న మాటలు, కోర్టుల్లో వారు వాదిస్తున్న తీరులో నేరం జరగలేదు అని చెప్పలేకపోతున్నారు. అసలు స్కామ్ ఏంది? రూ.3,300 కోట్ల ప్రాజెక్టు అన్నారు. ఇందులో రూ.3,300 కోట్లు సీమెన్స్ కంపెనీ పెడుతుందని, ఇందులో 10 శాతం ప్రభుత్వం పెడుతుందని ఒప్పందం చేసుకున్నారు. డబ్బులు విడుదల చేసేందుకు ఎంవోయూలు సంతకాలు చేసుకున్నారు. ఆ ఎంవోయూలో సంతకాలు, పేరు మారింది..దాని స్వరూపం ఏంది?. దాని విలువను ఎలా నిర్ధారించారా? రూ.370 కోట్లు ప్రజాధనం ఇంకొకరికి అప్పజెప్పే సమయంలో అ కంపెనీ ఏం చేస్తుందో చూడకుండా, ఇంతకంటే తక్కువకు మరో కంపెనీ చేస్తుందా అన్నది చూడకుండా రూ.370 కోట్లు రిలీజ్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ఆర్థికశాఖకు చెప్పకుండా సీఎం చెప్పారని , డబ్బులు రిలీజ్ చేయాలని అప్పటి అధికారులు నోట్‌ఫైల్‌లో పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తిని తీసుకువచ్చి ఎండీ, సీఈవోగా నియమించి, స్కిల్ డిపార్టుమెంట్‌లో చైర్మన్‌గా చంద్రబాబు తన వాళ్లను నియమించారు. రూ.370 కోట్లతో ఏదైనా చేసి ఉంటే బాగుండేదేమో?. దీని వల్ల ఎంత మందికి ఉపయోగం, మార్కెట్లో దీని విలువ ఎంత ఉందో స్టడీ చేయలేదు. ప్రభుత్వం డబ్బులు సీమెన్స్, ఇతరులకు కాకుండా రూ.240 కోట్లు నేరుగా అప్పజెప్పారు. 2017లోనే టీడీపీ ప్రభుత్వానికి జీఎస్‌టీ డిపార్టుమెంట్ నోటీసులు ఇచ్చింది. సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదని చెప్పింది. ఫెక్ ఇన్వాయిస్‌లు దొరికాయని వాళ్లు చెప్పారు. ఏ దశలో కూడా చంద్రబాబు తనకు తెలియదు అని చెప్పడానికి, ఇందులో కుట్ర ఉందని చెప్పడానికి ఒక్క ఆధారమైనా ఉందా? చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ.300 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు ఉన్న తరువాతే చంద్రబాబును ఇప్పుడు అరెస్టు చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత 2021లో కేసు నమోదు చేసి, సుదీర్ఘ కాలం విచారణ చేసింది. ఈడీ కూడా నలుగురిని అరెస్టు చేసింది. ఈ దశలో ఫైనల్‌గా అన్ని వేళ్లు చంద్రబాబు వైపు చూపిస్తున్నాయి. ఇంత పెద్ద నేరం కాబట్టి అరెస్టు చేసి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ భావించింది. ఆ తరువాత కోర్టు ముందు పెట్టడంతో జుడిషియల్ రిమాండుకు పంపించింది. టీడీపీ వాళ్లు మాట్లాడాల్సింది దేని మీద..బెయిల్‌పై మాట్లాడాలి. కానీ నెల రోజులుగా క్వాష్ పిటిషన్‌పైనే వాదనలు చేస్తున్నారు. కేసు విచారణకు రాకుండా స్టే తెచ్చుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు గమనిస్తే ..రూ.120 కోట్లు టిడ్కో ఇళ్లలో కాంట్రాక్టులు ఇచ్చినందుకు చంద్రబాబు ముడుపులు ముట్టాయి. ఆధారాలతో సహా ఐటీ శాఖ వివరించింది. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా మేనేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్కిల్ స్కామ్‌లో కుదరడం లేదు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుడు కిలార్ రాజేష్ చంద్రబాబుకు వచ్చిన ముడుపులు ఏరకంగా దాచారో తెలుసు. గత నెలలో ఈ ఇద్దరూ రాత్రికి రాత్రి విదేశాలకు పారిపోయారు. చంద్రబాబు సాక్ష్యాలను దేశాలను దాటించగలరని సీఐడీ భావించి అరెస్టు చేశారు. చంద్రబాబే ఇక్కడ సూత్రదారి, పాత్రదారి, లబ్ధిదారి. పక్కా ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిపై మాట్లాడకుండా 17ఏ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు తప్పి చేసినా కూడా తప్పించుకోవచ్చు. ఇక్కడ మనం ప్రసావిస్తున్న గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రతిపక్ష నేత..ఈయన రెండు ఎకరాలతో ఇప్పుడు లక్షల కోట్లకు అధిపతి అయ్యారు. ఇలాంటి వ్యక్తి స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికాడు. ఆయన సంతకాలు ఉన్నాయి. గంటా సుబ్బారావు అనే వ్యక్తిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని స్కామ్‌కు పాల్పడ్డాడు. బహిరంగంగా, భరితెగించి రూ.370 కోట్లు బయటకు పంపించి హవాలా ద్వారా చంద్రబాబు తీసుకున్నారు. కోర్టుల్లో ఈ అంశంపై ఫైట్ చేసి నిర్దోషిగా నిరూపించుకోవాలి. మరోవైపు ప్రజా కోర్టులో తన నిర్దోశత్వాన్ని నిరూపించుకోవాలి. త్వరలోనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఓక్స్ వ్యాగన్ కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సీబీఐకి అప్పగించారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయారు. చంద్రబాబే నేరస్తుడు కాబట్టే ఆ పని చేయలేకపోయాడు. ఇవాళ ఆధారాలతో అరెస్టు అయ్యాడు. విచారణకు రాకుండా తప్పించుకొని జనంలోకి వెళ్లి 73 ఏళ్ల వయసులో నన్ను అరెస్టు చేశారని దొంగ ఏడుపులు ఏడ్చి సానుభూతి పొందాలని చూశారు. నిలువు దోపిడీ చేసి, అడ్డంగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు. వీళ్లు ఏ ప్రయత్నాలు చేసినా, జాకీలు పెట్టి లేపినా కూడా పైకి లేవలేకపోతున్నారు. అసలైన కొడుకే ఢిల్లీలో కూర్చుంటున్నాడు. టీడీపీ నాయకులు ఎవరూ కూడా బయటకు రాలేకపోతున్నారు. దోషి అన్నది జనానికి తెలిసింది. నారా లోకేష్ ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారో తెలియదు. నోరు తెరిస్తే మమ్మల్ని ఏం పీకుతారని బెదిరింపులు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అందులో భాగంగానే మిగిలిన కేసులు వస్తున్నాయి. ఇవాళ లోకేష్ కూడా సీఐడీ విచారణలో ఉన్నారు. ఇన్నర్‌రింగ్ రోడ్డు రానప్పుడు అందులో అవినీతి ఎందుకు ఉంటుందని ఆరోపణలు చేస్తున్నారు. అలాంటప్పుడు హెరిటేజ్‌కు ఎందుకు భూములు కొన్నారు. లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఎందుకు ఉంటున్నారు. ఈ విషయాలు చిన్న పిల్లలకు కూడా అర్థమవుతాయి. రాని ప్రాజెక్టులో లాభం ఏముంది అంటున్నారు. కట్టింటే కాంట్రాక్ట్‌లో కూడా కమీషన్లు లాగేవారు. ఒక హత్యకు కుట్ర చేసి హత్య జరగలేదు కదా? నన్ను ఎలా శిక్షిస్తారు అన్నట్లుగా ఉంది. అమరావతి అంతా కూడా కుట్రకోణమే. అన్నింటిని మోసం చేసి వేల కోట్లు దోచుకున్నారు. ఇవన్నీ చేసిన తరువాత ఇందులో స్కిల్ స్కామ్‌లో అవినీతి జరిగిందని ఆధారాలతో అరెస్టు చేస్తే దాని గురించి మాట్లాడటం లేదు. నన్ను ఎవరు అడుగుతారులే అని భరితెగించి చంద్రబాబు అలా వ్యవహరించారేమో? ఏపీ బీజేపీని ఏపీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఎజెండా పొద్దున నుంచి టీడీపీదే. కుటుంబ పరంగా అలా చేసుకోవడంలో తప్పు లేదు. ఎన్టీఆర్‌ను దించేవరకు ఆ కుటుంబం అలాగే ఉంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం చంద్రబాబుకు పూర్తి అండగానే ఉంటున్నారు. ఎన్టీఆర్‌ను దించడం మొదలు ఇప్పటి వరకు అదే ప్రయత్నంలో ఉన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఆమె కలిసి చంద్రబాబుకు మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారట. అసలు కేసు గురించి మాట్లాడకుండా లేని దానిపై క్రియేట్ చేస్తున్నారు. మీ వద్ద ఉన్న ఆధారాలతో ముందుకు వచ్చి కోర్టులో నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి. ఎంత సేపు గవర్నర్ సంతకం లేదు..అనుమతి లేదని వాదిస్తున్నారు. అసలు విషయం పక్కకు వేస్తున్నారు. దేశంలోనే అత్యంత అరుదైన వాదన ఇది ఒక్కటే ఉంటుందేమో?. కొట్టేసేవాడే ధర్మకర్త ఉంటే, యజమానే దోపిడీకి ప్లాన్ చేస్తే దాన్ని ఎలా చూడాలి. తమిళనాడులో జయలలిత తనను అవమానించారని ముఖ్యమంత్రి కాగానే కరుణానిధిని అరెస్టు చేయించారు దాన్ని కక్షసాధింపు అంటారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబును అరెస్టు చేయించి ఉంటే దాన్ని కక్షసాధింపు అంటారు. మా ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇందులో కక్షసాధింపు ఏముంటుంది? 73 ఏళ్ల వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడితే మాకేమి వస్తుంది. చంద్రబాబు జైల్లో ఉంటే ఏమీ? బయట ఉంటే ఏమీ? అంతెందుకు లోకేష్ బయట తిరుగొచ్చు కదా? జైల్లో మొదట దోమలు అన్నారు.. తరువాత నక్సలెట్లు అన్నారు..నిన్న మాత్రం డీహైడ్రేషన్ అంటున్నారు. జైల్‌లోకి వెళ్లినప్పుడు చంద్రబాబు తన బంధువులతో ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలుస్తుంది. ఇలాంటి స్టేట్‌మెంట్లతో వారి లేకి తనం కనిపిస్తోంది. స్కామ్‌లో అరెస్టు అయిన వ్యక్తికి మద్దతుగా తట్టలు కొట్టడం, విజిల్ వేయడం ఏంటి? ఆయనేమైనా విప్లవకారుడా? ఏ నాయకుడైనా మద్దతు చెప్పాడా?. వాళ్ల ఏడుపు ప్రపంచ ఏడుపు కావాలన్నది వారి కోరిక. అలాంటి వారు గతంలో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయడం మన ధౌర్భాగ్యం. 45 ఏళ్ల టీడీపీ రాజకీయం చేయకుండా అనవసర కేసులు, చంద్రబాబు అరెస్టుపై ఫోకస్ పెట్టడం సిగ్గుచేటు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.