ఏపీలో సంక్షేమ పథకాలు హరీష్‌రావుకు కనబడటం లేదా?

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి

అల్లుడు, కూతురు అందరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారు

ౖహె దరాబాద్‌ను బాగుచేసుకోలేని వారు మా గురించి మాట్లాడటం ఏంటి?

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న నవరత్నాలు సంక్షేమ పథకాలు తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు కనబడటం లేదా అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీష్‌రావుపై  లేళ్ల అప్పిరెడ్డి ఫైర్‌ అయ్యారు.  తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.  హరీష్‌రావు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ గురించి ఏం తెలుసని హరీష్‌రావు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఏపీలో సంక్షేమ పథకాలు హరీష్‌రావుకు కనబడటం లేదా అని నిలదీశారు. తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ఏపీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అల్లుడు, కూతురు అందరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు. చినుకుపడితే హైదరాబాద్‌ రోడ్లపై పడవలో తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు. ౖహె దరాబాద్‌ను బాగుచేసుకోలేని వారు మా గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు.
 

Back to Top