తాడేపల్లి: వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్ అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా మా నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో కుట్రంతా బాబుదేః –వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడే... – వివేకా హత్య కేసులో స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మొత్తం చంద్రబాబుదే. – బాబు తనకు నచ్చిన పద్ధతిలో ఒక కట్టు కథనాన్ని తయారు చేసి, తనకు అనుకూలమైన మీడియా ద్వారా విడుదల చేస్తారు. అదే నిజం అని జనాన్ని నమ్మించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా కలిసి కుట్రలు చేస్తాయి. చంద్రబాబు గతంలో వైఎస్ గారిపైన కూడా ఫ్యాక్షన్ ముద్ర వేశారు. – గతంలో సిట్ రిపోర్టులు బయటకు వస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. – వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధ లేదు. – ఈ కేసులో ఆదినారాయణరెడ్డి, బీటెక్‌రవికి సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయి. – వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలానికి వెళ్లారు. శివశంకరరెడ్డి కూడా తప్పు చేయలేదని మేం భావిస్తున్నాం. – వివేకానందరెడ్డి గారు అజాత శత్రువు. వివేకా చుట్టూ నేరప్రవృత్తి కలిగిన మనుషులున్నారు. వివేకా కుటుంబంలోనూ విభేదాలున్నాయి. సీఎం జగన్ గారిని టార్గెట్ చేస్తున్నట్టు ఉందిః –ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే జగన్ గారిని టార్గెట్ చేయడానికి చూస్తున్నట్లుగా ఉంది. – బాబుకు ఎల్లో మీడియాలో ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిగారిపైన బ్యానర్ స్టోరీలు కావాలి. అందుకే ఇటువంటి తప్పుడు రాతలు రాస్తున్నారు. – జగన్ గారి కుటుంబానికి వివేకానందరెడ్డి గారితో అవినాభావ సంబంధముంది. వివేకానందరెడ్డి గారు విజయమ్మపై పోటీ చేసినా, ఆ తర్వాత ఆయన వైఎస్సార్‌సీపీ లోకి వస్తానంటే సాదరంగా జగన్ గారు ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అవినాష్‌రెడ్డి గారికి ఒక తండ్రిలా సలహాలు ఇచ్చేవారు. – టీడీపీ, చంద్రబాబు లైన్‌కు అనుగుణంగా సీబీఐలో కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారు. – నిష్పక్షపాతంగా వారు పనిచేయకపోగా, కల్పిత వాంగ్మూలాలను సృష్టించి , జగన్ గారిపై వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారు. – సీబీఐ ప్రకటనల వెనుక రాజకీయ ప్రమేయముంది. – ఈ కేసును అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిపై కుట్రలు చేస్తున్నారు. – నాడు వివేకా హత్యకు, రెండో పెళ్లి కారణమన్నట్లుగా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. అప్పుడు బాబుపై ఎక్కడ ఈ కేసు పడుతుందోనని, బాబును రక్షించడానికి ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలు రాసింది. – బాబు, ఎల్లో మీడియా టార్గెట్ జగన్‌గారు ... రాబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి నిందలు వేస్తే, వక్రీకరణలు చేస్తే ఆ ఎన్నికల్లో ఓట్లు పడతాయనే దురాశతో, కుట్రతో ఇంతగా చేస్తున్నారు. దీన్ని అందరూ గమనించాలని కోరుతున్నాను. – దీనిచుట్టూ రాజకీయాలు చేయడం, దీన్నుంచి లబ్ధిపొందాలని బాబు చూడడం రాష్ట్ర రాజకీయ దౌర్భాగ్యం. వివేకా గుండెపోటుతో చనిపోయాడని నాడు శివప్రకాష్ రెడ్డే చెప్పాడుః – సంఘటన జరిగిన తర్వాత శివప్రకాష్‌రెడ్డి (వివేకానందరెడ్డి బావమరిది), అక్కడ దొరికిన లేఖ అనుమానాస్పదంగా ఉందని ఎందుకు చెప్పలేదు.? – వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి తనకు ఫోన్ చేసి, గుండెపోటుతో బావ చనిపోయారని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. – వివేకానందరెడ్డి మరణాన్ని మొత్తం బ్రేక్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రికే. రెండో వివాహం వల్ల కూడా హత్యకు అవకాశాలు ఎందుకు ఉండకూడదన్న అనుమానాలు లేవనెత్తుతూ ఆ పత్రిక ఆరోజు కథనాన్ని రాసింది. ఎందుకంటే బాబు ఎక్కడ ఇరుక్కుంటాడో నని జ్యోతి కథనాన్ని అలా రాసింది. – కుటుంబ సభ్యులంతా కలిసి వివేకా చెక్‌పవర్ తీసేశారని కూడా ఆంధ్రజ్యోతి ఆ కథనంలో ఉటంకించింది. వివేకా హత్య కేసులో బాబుదే మాస్టర్ మైండ్ః – వివేకా హత్య కేసును పక్కదారి పట్టించడానికి అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, భారతమ్మ పేర్లను ప్రస్తావించడం కుట్రపూరితం. – దీని వెనుక ఉన్నదంతా చంద్రబాబే... అతని మాస్టర్ మైండే. – వ్యవస్థలను మేనేజ్ చేయడం బాబుకున్న లక్షణం. ఈ కేసులోనూ బీజేపీలో కోవర్టులుగా ఉన్న తన మనుషుల ద్వారా చంద్రబాబు ఇన్‌ఫ్లుయన్స్ చేస్తున్నారని తేలిపోతుంది. – దీనికి అవసరమైన కథనాలన్నీ తన ఎల్లోమీడియాలో వచ్చేలా చూడడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. – రామోజీ రావు కూడా ఒక కుట్రదారు కనుక ఇలాంటి కుట్రదారులంతా బాబుతో చేతులు కలుపుతున్నారు. వీరంతా పరాన్న జీవులు. – వీళ్ళ స్వార్థ రాజకీయం కోసం.. జగన్ మోహన్‌రెడ్డి గారిపై నిందలు మోపుతున్నారు. – నిజంగా బాబు ప్రభుత్వ హయాంలోనే కదా...ఇదంతా జరిగింది. సీబీఐని కూడా రాష్ట్రంలోకి రానివ్వనన్న వ్యక్తి చంద్రబాబు గన్నవరం ఘటనలో రెచ్చగొట్టింది పట్టాభే.. గన్నవరం ఘటనలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. – పట్టాభి అనే వ్యక్తి గన్నవరం పోకపోతే కొట్లాటలు లేవు. దాడులు లేవు. అక్కడ ఎదురెదురు పడిన రెండు పార్టీల వ్యక్తులు దాడులకు దిగినప్పుడు పట్టాభిని రక్షించింది పోలీసులు. – బూతులు తిట్టి, రెచ్చగొట్టింది పట్టాభే. లోకేశ్ ఎలా మంత్రిగా పనిచేశాడో తెలియదు. అధికారంలోకి వద్దామనే ఆలోచన ఉంటే చట్టాన్ని గౌరవించవద్దని ఎలా మాట్లాడతాడు? అయినా సరే...మేం మిన్నకున్నా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. - దీనికి భిన్నంగా బాబులా మేం వ్యవహరిస్తే పరిస్థితి వేరేగా ఉండేది. – జగన్ గారు మౌనంగా అన్నీ సహిస్తున్నారు కాబట్టే... లోకేశ్, బాబు, పవన్‌కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. గన్నవరంలో అల్లర్లకు కారణం చంద్రబాబే.