వైయస్‌ అవినాష్‌రెడ్డి కాల్‌ రికార్డులో సంచలనం ఏమీ లేదు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: వైయస్‌ అవినాష్‌రెడ్డి కాల్‌ రికార్డులో సంచలనం ఏమీ లేదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి ఫోన్‌ను పోలీసులు ఆరోజే చెక్‌ చేశారని తెలిపారు. ఈ విషయంపై నాలుగు రోజుల నుంచి తెగ ప్రచారం చేస్తున్నారని, ఏదో జరిగిపోయిదంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌తో మాట్లాడేందుకు నవీన్‌కు అవినాష్‌ ఫోన్‌ చేశారని తెలిపారు. శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

 వైయస్ జగన్ గారికి ఆయన చిన్నాన్న అయిన వివేకానందరెడ్డిగారి హత్య గురించి కమ్యూనికేట్ చేయడం కోసమే ఎంపీ అవినాష్ రెడ్డి.....నవీన్,ఓఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిగారికి ఫోన్ చేశారని ఇందులో తప్పేముందని  వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సిఎం క్యాంప్ కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి, వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 

          ఎంపీ అవినాష్ రెడ్డిగారిని సిబిఐ విచారణకు పిలిచిన సమయంలోను,నేడు జగన్ గారి ఇంట్లో పనిచేసే నవీన్ ను, OSD కృష్ణ మోహన్ రెడ్డిని పిలిచిన సమయంలోనూ ఎల్లోమీడియా అనవరస రాధ్దాంతం చేస్తోందని  వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎంపి అవినాష్ రెడ్డికి మొదటగా వివేకానందరెడ్డి హత్య గురించి సమాచారం వివేకానందరెడ్డిగారి బ్రదర్ ఇన్ లా అయిన శివప్రకాష్ రెడ్డి నుంచి వచ్చిందనేది అందరికి తెలుసు. ఆ తర్వాతే అవినాష్ రెడ్డి స్పాట్ కు వెళ్లడం జరిగింది. అవినాష్ రెడ్డి అక్కడకు వెళ్లాక స్వయంగా పోలీసులకు ఇన్ ఫామ్ చేశారు. ఇదంతా అందరికి తెలుసు. ఆరోజు ఎవరెవరితో మాట్లాడారనేది కాల్ రికార్డ్ టిడిపి అధికారంలో ఉన్న సమయంలోనే పోలీసుల చేతిలో ఉంది. ఈరోజు నవీన్ అనే వ్యక్తి పేరు బయటకు తెచ్చారు. నిజానికి ఆరోజు కాల్ రికార్డ్ చెక్ చేసిినా నవీన్ పేరే వచ్చేది. ఆ తర్వాత కాల్ చెక్ చేసినా ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిగారి పేరే తెలిసి ఉండేది. ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే ఆరోజుకు... ఈరోజుకు కూడా నవీన్ కాని,కృష్ణమోహన్ రెడ్డి కాని శ్రీ వైయస్ జగన్ గారితోనే అసోసియేట్ అయి ఉన్నారు. వారు అక్కడ ఉన్నారు కాబట్టే వివేకానంద హత్య గురించి సమాచారం ఇచ్చేందుకు అవినాష్ రెడ్డి వారికి ఫోన్ చేయడం జరిగింది. ఇందులో ఏదీ అసహజంగా లేదు. దాంట్లో సంచలనాత్మకమైనవి ఏవీ లేవు. విషయం కొత్తది కాదు. ఫోన్లు ఎవరివి మారినవి కాదు. ఆ ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయనేది ఈరోజు కొత్తగా తెలిసింది కాదు. గతంలో చూస్తే హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఎందుకు నాలుగురోజుల నుంచి ఏదో సంచలనం జరిగిపోయిందన్నట్లు చేస్తున్నారు. కుట్ర కోణం ఉన్నట్లు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనేది ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయమే.

         వైయస్ రాజశేఖరరెడ్డిగారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి హెడ్ లాగా వివేకానంద రెడ్డిగారు ఉన్నారు. వివేకానంద రెడ్డిగారు జగన్ గారికి సొంత బాబాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. మా పార్టీ ఎంపి అయిన అవినాష్ రెడ్డి,ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి స్వయానా కజిన్. పార్టీ పరంగాను,కుటుంబపరంగాను అన్ని విధాలా అందరూ సన్నిహితులు. వివేకానంద హత్య గురించి సమాచారం తన అన్న,పార్టీ అప్పటి పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ గారికి అవినాష్ రెడ్డి ఇచ్చారు.ఆ ఫోన్ కే ఎందుకు చేసి చెప్పారు అంటే శ్రీ వైయస్ జగన్ దగ్గరకు సమాచారం ఆ ఫోన్ ద్వారానే వెళ్తుంది.నేను ఇటీవల కూడా చెప్పాను....చంద్రబాబుకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నా...పత్రికాధిపతులు అయిన రామోజీరావు,రాధాకృష్ణలకైనా సరే వారి క్లోజ్ సర్కిల్  ఎవరికైనా సరే సమాచారం ఇవ్వాలంటే డైరక్ట్ గా కాకుండా ఫోన్ రిసివ్ చేసుకునే వ్యక్తులు వంటవారిగానో,డ్రైవర్లుగానో ఉంటారు. వారికి ఫోన్ చేసి సమాచారం చెప్పాలంటే వారి ద్వారా ఫోన్ ఇస్తుంటారు. ఇందులో అసహజం ఏమీ లేదు.
ఈ అంశాలపై గంట..గంటన్నర ప్రశ్నిండమేంటి....ఆ గంటన్నర ఏమి అడిగి ఉంటారు. బహుశా అక్కడ ఎప్పటినుంచి పనిచేస్తున్నారు...మీరు ఏం చేస్తుంటారని అడిగి ఉంటారు. ఎక్కువ సేపు వెయిట్ చేయించి ఉండచ్చు. అక్కడ ఏమి అడగారనేది నాకు తెలియదు. ఎటు తిప్పి ఎటు తిరగేసినా ఇంతకుమించి ఏమీ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అంతకుముందు అంటే హత్యకు గురైన ముందురోజు అవినాష్ రెడ్డి ఎంపిగా పోటీ చేస్తుంటే ఆయనకు మధ్దతుగా వివేకానందరెడ్డి ప్రచారం నిర్వహించారు. పేపర్ క్లిప్పింగ్ లు కూడా ఉంటాయి. టివిలలో కూడా ఉంటాయి.

       ఎన్నికలు నెలలో వస్తాయి కాబట్టి ఎంపి అవినాష్ రెడ్డి జమ్మలమడుగుకు వెళ్లే దారిలో ఉంటే శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తే వెనుదిరిగి సంఘటనా స్దలానికి వచ్చారు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేయడం ద్వారా అక్కడకు వచ్చిన అవినాష్ రెడ్డి హస్తం ఏదో ఉందని కేసు బిల్డ్ చేస్తే దానిని బేస్ చేసుకుని అవినాష్ రెడ్డిగారిని విచారణకు పిలిచారు. దానిని బేస్ చేసుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత దానిముందు వెనక కొత్తకోణాలు ఉన్నాయని రాయడం,ఇందులో ఫ్యామిలీతో సహా లాగి ఏదో చేయాలని చూడటం రాజకీయం కాక ఏముంటుంది. చంద్రబాబునాయుడు చేసే నీచమైన రాజకీయంలో ఇది ఒక చిన్నపార్ట్. పోను పోను ఇలాంటి డ్రామాలు ఎన్ని చేస్తారో తెలియదు. వాళ్ళు ఒంటిచేత్తోనే చప్పట్లు కొట్టి చప్పుడు సృష్టించే శక్తి ఉండేవాళ్లు. ఇలాంటివి ఎన్నో చేయవచ్చు. కాని నిజమైతే ఇంతకుమించి ఏమీ జరగలేదు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేయకపోతే అవినాష్ రెడ్డి అక్కడకు వచ్చే ప్రసక్తిలేదు. అలాగే ఫస్ట్ సమాచారం వెళ్ళింది... వివేకానందరెడ్డిగారి అల్లుడు రాజశేఖరరెడ్డికి. వివేకానందరెడ్డి స్వహస్తాలతో రాసిన ఓ లెటర్ పడి ఉంది. అనుమానస్పద మృతి అని అప్పటికే తెలిసింది అయినా ఆ విషయం ఎందుకు దాచిపెట్టారు. అప్పుడే అల్లుడు రాజశేఖరరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి ఉండవచ్చు. లేదా శివప్రకాష్ రెడ్డి ...అవినాష్ రెడ్డిగారికి ఫోన్ చేసినప్పుడు లెటర్ దొరికింది...అనుమానంగా ఉందని చెప్పి ఉండవచ్చు. ఎందుకు చెప్పలేదు. అసలు ప్రశ్నలు అక్కడ వేయాల్సింది.

        శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసినందుకు అవినాష్ రెడ్డి అక్కడకు వెళ్తే ఆయనపై అనుమానం వచ్చేలా కధలు వండివార్చి..దానికి తోడుగా కమ్యూనికేషన్ ఇచ్చిన నేపధ్యంలో శ్రీ వైయస్ జగన్ గారి ఇంట్లో వర్క్ చేస్తున్న వారిని విచారించడం... ఇదంతా చూస్తే వారి మోటో ఏంటంటే కేసును శ్రీ వైయస్ జగన్ గారి వద్దకు తీసుకురావాలనేదిగా కనబడుతోంది. అలా తీసుకురావడానికి ఏమిలింక్ ఉందంటే నవీన్ కు ఫోన్ వెళ్ళింది... లేదా కృష్ణమోహన్ రెడ్డిగారికి ఫోన్ వెళ్ళింది. వాటిజ్ రాంగ్ ఇట్ అంటే ఎవ్వరూ ఆన్సర్ ఇవ్వడం లేదు. దానిని బేస్ చేసుకుని కధలు అల్ల్లి శ్రీ వైయస్ జగన్ గారి కుటుంబానికి లింక్ కలపచ్చు అనే దుర్భిద్ది కనిపిస్తోంది. ఇంతకంటే నీచమైన రాజకీయం ఏముంటుంది. ఇందులో సూత్రధారులు చంద్రబాబునాయుడో... ఇంకొకరో.. వాళ్లు ఉంటే పాత్రధారులు చాలామంది ఉన్నారు... వారు తెలియదు కాని వీరంతా చేసే రాజకీయం ప్రజలకు తెలుసు కాబట్టి అది నిలబడదు. అయితే ఈ రోజుకు అది సంచలనాత్మకం కాబట్టి మేం వివరణ ఇవ్వాల్సి వస్తుంది.మేం కూడా చెప్పిందే చెప్పాల్సి వస్తుంది.

       ఏ ఎస్పి రామ్ సింగ్ వ్యవహారశైలి ఎలా ఉంది...ఎందుకంటే నోటీసులు ఎవరికి ఇవ్వబోతున్నారో మీడియాలో వస్తుంది. విచారణ ఏం జరిగిందనేది కూడా కొన్ని మీడియా సంస్ధలకే వస్తోంది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ ప్రశ్న లాస్ట్ టైమ్ కూడా వేశారు...శ్రీ వైయస్ జగన్ గారిపై గతంలో అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆరోజు సిబిఐ ధోరణి ఎలా ఉందో...వాళ్ళు ఈ కేసుకు సంబంధించి ఎవరెవరినో పిలిచినప్పుడు ముందునుంచి ఎవర్ని పిలవాలో కూడా ఈనాడుగాని,ఆంధ్రజ్యోతిలోగాని లేదా వారి గ్రూపులకు సంబంధించిన టివిలలో వచ్చేవి. ఆ తర్వాత పిలిచే వాళ్ళు. లేదా వీళ్ళు పిలిచి విచారణ జరుగుతుండగానే అక్కడ ఏం జరుగుతుందో కధలు,కధలుగా వచ్చేవి. అంటే గతంలో జగన్ గారి అక్రమ కేసుల విచారణ సమయంలో ఎలా జరుగుతుందో అప్పుడు ఆ మీడియా సంస్ధలకు సిబిఐకి ఎలా సంబంధాలు ఉన్నాయో నేడు అదేలా కొనసాగుతున్నాయి. లేకపోతే అవినాష్ రెడ్డి సిబిఐ అధికారులు మాట్లాడుకుని నవీన్ ను పిలవాలని అనుకుంటే అది బయటకు ఎందుకు వచ్చిందో అర్ధం కాలేదు. ఇన్వెస్టిగేట్ జర్నలిస్త్ ఎవరైనా చూశారనుకోవచ్చు. ఆరోజు అంత సంచలనాత్మకమైనవి ఎందుకు బయటకు వచ్చాయి. ఎవరు రివీల్ చేస్తున్నారో....ఎవరు దానిని ప్లాన్ చేస్తున్నారో..ఎవరు లేనిదానిని లాగి ఎవరికి తెలియని విషయాలు ప్రచారంలోకి ఎవరు తెస్తున్నారు. ఇవన్నీ ఆలోచిస్తే మొత్తంగా కుట్ర పూరితమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్టిమేట్ గా వాళ్ళ గోల్ చూస్తే 2024 ఎన్నికలలో శ్రీ వైయస్ జగన్ గారి క్యారెక్టర్ పై బురద చల్లడానికి కుదురుతుందేమో...ప్రజలలో ఏవైనా అనుమానాలు తీసుకురావడానికి కుదురుతుందేమో అనే దుర్భుద్దితో కూడిన కుట్రలు చేస్తున్నారు. కాని ఆకాశం పై ఉమ్మితే వారి మొహానే పడుతుంది. ఇంతకంటే పెద్దవే చెప్పారు వాటిని జనం నమ్మలేదు. విశ్వసించలేదు. ఎందుకంటే చంద్రబాబుగాని,వాళ్ళ గ్యాంగ్ గాని ఆయనకు సంబంధించివారి ఇదంతా చేస్తున్నారు.

      కుట్ర కోణం అంటున్నారు ఎవరిని అనుమానించే అవకాశం ఉంది అనే ప్రశ్నకు బదులిస్తూ చంద్రబాబు,బిజేపిలో ఉన్న స్లీపర్ సెల్స్ గాని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు...మీడియాకు సంబంధించి అజెండా అంతా అక్కడనుంచే ఫిక్స్ అవుతుంది టిడిపికి సంబంధించి ఆంధ్రజ్యోతి గ్రూప్ గాని,ఈనాడు గ్రూప్ గాని అక్కడనుంచే డైరక్షన్స్ వెళ్తున్నాయి. వాటి ప్రకారమే నటించేవాళ్ళంతా నటిస్తున్నారు. వీరంతా కలసి చేస్తున్నారని మేం భావిస్తున్నాం.

    బిజేపిలోని స్లీపర్ సెల్స్ సిబిఐని ప్రభావితం చేయగలిగేస్దాయిలో ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ  సిస్టమ్ ను ప్రబావితం చేయగలగడమే ఏకైక శక్తిగా.....సిస్టమ్స్ ను మేనేజ్ చేయగలగడమే శక్తిసామర్ద్యాలు ఉన్న చంద్రబాబు ఆయనకింద తర్ఫీదు పొందిన వాళ్ళందరు చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా చేయగలరు. చేసే సర్వైర్ అవుతున్నారు. చేసే రాజకీయాలలో ఉన్నారు. అలా చేసే పవర్ లోకి కూడా రాగలిగారు. వారిపై ఉన్న కేసులలో కూడా పక్కకు తప్పుకోగలుగుతున్నారు.

 

Back to Top