అందరూ సంయమనం పాటించాలి

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: కోనసీమ జిల్లా ప్రజలు సంయమనం పాటించాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. అమలాపురంలో అల్లర్లను ఆయన ఖండించారు.  కోనసీమకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని, అన్ని వర్గాలు కోరాయని, ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దీని వెనుక ఏవో రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పారు. అంబేద్కర్‌ పేరు పెడితే పార్టీకి లాభం ఉంటుందా అని ప్రశ్నించారు. అంబేద్కర్‌ ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాల కుట్ర అని మండిపడ్డారు. 

అంబేద్కర్‌ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాల కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ, జనసేన, బీజేపీలు కోనసీమకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండు చేసినట్లు చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. 
 

Back to Top