తుది ఘట్టానికి కోటి సంతకాల ప్రజా ఉద్యమం

వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీ కరణకు వ్యతిరేకం గా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య   స్పందన వచ్చిందని వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గురువారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఎప్ప టికప్పుడు ఈ కార్యక్రమం తుది ఘట్టంపై అందరితో మాట్లాడుతు న్నారని చెప్పారు. ఈ నెల 10న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే కోటి సంతకాలను జిల్లా కేంద్రాలలో ఉంచి, అక్కడి నుంచి 13న ఒకేసారి అన్ని నియోజకవర్గాల సంతకాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ఆ రోజు జిల్లా కేంద్రంలో వేలాది మందితో ర్యాలీగా నిర్వహించి, నాయకుల ప్రసంగాల ఆనంతరం కోటి సంతకాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించాలని చెప్పారు. అప్పటి వరకు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇందుకోసం జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించుకోవడంతో పాటు అనుబంధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు పార్టీ అధినేత వైయ‌స్ జగన్, ముఖ్య నాయకులు గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు అందజేస్తారని తెలిపారు. 

Back to Top