పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైయస్‌ జగన్ విచారం

పల్నాడు జిల్లా:  ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్ధులు మరణించడం ప‌ట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్య‌క్తం చేశారు.  నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్‌ రహదారిపై విద్యార్ధులు ప్రయాణిస్తున్న కారు కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అయ్యప్పమాల వేసుకుని ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్ధులు మృతిచెందారు. ఎంతో ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా ప్రమాదంలో మరణించిన ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయ‌న త‌న‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Back to Top