విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది ఘనత వైయ‌స్ జగన్ దే 

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కూట‌మి ప్ర‌భుత్వం విద్యార్థులకు మోసం

అనంత‌పురం నగర మేయర్ మహమ్మద్ వసీం

అనంతపురం:  విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చింది ఘనత వైయ‌స్ జగన్ దే అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, అనంత‌పురం న‌గ‌ర మేయ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ వ‌సీం తెలిపారు. ఇంజనీరింగ్, కోర్సులు చదువుతున్న విద్యార్థులకు 8 త్రైమాసికాల  ఫీజు రీయంబర్స్ మెంట్  బకాయిల్ని కూటమి ప్రభుత్వం చెల్లించకుండా వారిని మోసం చేస్తోదని మండిప‌డ్డారు. తన క్యాంప్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో విద్యార్థులకు ఫీజులు రాక  ఉన్నత విద్య కి దూరం అవుతున్నారని మండి పడ్డారు.విద్యార్థులకు  రూ.7800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు పడ్డటంతో ఫీజు మొత్తం చెల్లించాలని యాజమాన్యాలు విద్యార్థుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నా  ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గత వైసీపీ హయాంలో  జగన్మోహన్ రెడ్డి ప్రతీ క్వార్టర్ ఫీజు ఏ నెలలో ఇస్తున్నారో స్పష్టంగా పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసారని పేర్కొన్నారు. కూటమి పాలనలో కళాశాల ఖాతాల్లోకి మంజూరు చేస్తామన్నా అవి కూడా చెల్లించడం లేదన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి అయినా బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు సర్టిఫికేట్ లు ఇవ్వక ఉన్నత ఉద్యోగ అవకాశాలు వచ్చినా చిన్న చిన్న పనులు చేసుకునే పరిస్థితికి విద్యార్థులు వెళ్ళటం బాధాకరమన్నారు.మరో వైపు గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో లాగా ఫీజు రీయంబర్స్ మెంట్ వస్తుందన్న భరోసా తో తమ పిల్లలను ఉన్నత చదువులకు చేర్పించిన తల్లిదండ్రులు నేడు ఫీజులు చెల్లించాలని   కళాశాలలు ఒత్తిడికి చేస్తుండటంతో ఏమి చేయాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారన్నారు.40 ఏళ్ల రాజకీయ అనుభవం,4 సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కు విద్యార్థుల కష్టాలు కనపడలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షేక్ బాబాస‌లామ్‌, న‌గ‌ర‌ కార్పొరేటర్లు రహంతుల్లా, శ్రీనివాసులు,కమల్ భూషణ్  తదితరులు పాల్గొన్నారు.

Back to Top