చేతకాని బెదిరింపులు ఆపి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి 

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ వి.విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో నారా లోకేష్‌, టీడీపీ నేత‌లు మాట్లాడుతున్న తీరును వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ వి.విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలను లేపేద్దామని, కట్ డ్రాయర్లతో ఉరేగిస్తామని లోకేష్ యువగళంలో బెదిరిస్తున్నారంటే వారి సైకో మనస్తత్వం అర్థం చేసుకోవచ్చు. పాదయాత్రలో లిక్కర్ తగ్గిస్తే పద్దతిగా ఉంటుంది లోకేష్. చేతకాని బెదిరింపులు ఆపి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అంటారు. కానీ సెల్ఫీ తీయడమే రాదు. కంప్యూటర్ కనిపెట్టిందీ తానే అంటారు... కనీసం దాన్ని ఆన్ చెయ్యలేరు. ఎందుకు ఆ స్వీయ ప్రగల్బాలు, సొంత డబ్బా చంద్రబాబు గారు? పచ్చ మీడియా టముకేస్తుందని నోటికొచ్చిందల్లా మాట్లాడితే ఎలా? అంటూ అంత‌కు ముందు చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top