రాజమహేంద్రవరం: ఒక శాతం అదనంగా జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరటం విడ్డూరంగా ఉందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి,రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్స్‌లు పెంచేయడమా అని ప్రశ్నించారు. రాజుల కాలంలో ప్రజలను దోచుకుని ఖజానాలు నింపుకునేవారు ..అది ఇదేనా? విజయవాడ వరదల్లో డబ్బు ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసు. వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్ళు అని ఈనాడులో రాశారు.ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చేశాయ్ అని ఇదే అంశంపై ఈనాడులో కథనం వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా..ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారు. శనివారం రాజమండ్రిలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. మార్గాని భరత్ ప్రెస్‌మీట్. ముఖ్యాంశాలు: జీఎస్టీపై సర్‌ఛార్జ్?: – కూటమి ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిన «నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సామాన్య ప్రజల నడ్డి విరిగి, కుయ్యోమొర్రో అంటుంటే, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి, జీఎస్టీపై ఒక శాతం సర్‌ఛార్జ్ విధించాలని ప్రతిపాదించడం దారుణం. – అది అమలైతే ఇంకా బాదుడే బాదుడు. నిత్యవసరాలు ఏం కొన్నా దేశంలో కన్నా, ఇక్కడ ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. సంపద సృష్టి అంటే భారం మోపడమా?: – సంపద సృష్టి అంటే భారం మోపడమేనా?. చంద్రబాబు మాటలకు అర్ధం ఇదేనా?. – చంద్రబాబు ఎన్నికల మందోమాట. అధికారంలోకి వచ్చాక మరోమాట. అదే ఆయన నైజం. – జీఎస్టీపై సర్‌ఛార్జ్ విధిస్తే, అది ప్రజలపై మరింత భారం వేస్తుంది. – అయినా అదేదో గొప్ప నిర్ణయం అన్నట్లు.. ‘వెసులుబాటు కల్పించండి’ అంటూ గొప్పగా హెడ్డింగ్ పెట్టి ఈనాడు అచ్చేసింది. – విజయవాడ వరదలను చూపి రూ.500 కోట్లకు పైగా దాతల నుంచి వసూలు చేసి, వాటిని ఎలా దారి మళ్లించారో చూశాం. అది చాలదన్నట్టు ఇప్పుడు జీఎస్టీపై సర్‌ఛార్జ్ రూపంలో వేల కోట్లు దోచుకుందామని ప్లాన్ చేస్తున్నారా?. అప్పుడలా.. ఇప్పుడిలా..ఊసరవెల్లి: – చిన్నప్పుడు మేం ఇంగ్లిష్ చదువుకునేటప్పుడు కామా(,) కి ఉన్న ఇంపార్టెన్స్ గురించి చెబుతూ.. ఏ్చnజ ఏజీఝ, n్టౌ ్ఛ్చఠ్ఛి జిజీఝ.. అనే వాక్యానికి కామాను మార్చి.. ఏ్చnజ ఏజీఝ n్టౌ, ్ఛ్చఠ్ఛి జిజీఝ.. రాయడంతో అర్థమే మారిపోయింది. – ఇదంతా దేనికంటే.. వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ‘స్మార్ట్ మీటర్లు.. ఉరితాళ్లు’ అని ఎల్లో మీడియాలో రాశారు. చంద్రబాబు సీఎం కాగానే స్మార్ట్ మీటర్లు వచ్చేశాయని గొప్పగా చెబుతున్నారు. – రైతు మెడకు ఉరితాళ్లు వేయవద్దని ప్రతిపక్ష నేతగా చెప్పిన చంద్రబాబు, ఆయన సీఎం కాగానే స్మార్ట్ మీటర్లు వచ్చేశాయని, పండగ చేసుకోవాలన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఛార్జీలపై మాట తప్పారు: – అధికారంలోకి వస్తే ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాట తప్పారు. – విద్యుత్ ఛార్జీల రూపంలో ఏకంగా రూ.20 వేల కోట్ల భారం మోపుతున్నారు. నవంబరు 1నుంచి యూనిట్‌కు రూ.1.58 పెంచారు. అధ్వాన్న పరిస్థితులు: – ప్రభుత్వ బడులు పరిస్ధితి అధ్వాన్నంగా తయారైంది. మధ్యాహ్న భోజనం కూడా దారుణంగా తయారైందని పిల్లలు ఇంటి నుంచే భోజనం తెచ్చుకునే అధ్నాన్న పరిస్థితులున్నాయంటే చంద్రబాబు పాలన ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – ఇసుక దొరకడం లేదని కూటమి ఎమ్మెల్యేలే అంటున్నారు. నిన్న అసెంబ్లీలో జ్యోతుల నెహ్రూ కూడా పబ్లిక్‌గానే ఒప్పేసుకున్నారు. ఇంకా ఎందుకు సమర్ధించుకుంటున్నారు?. – కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే అలస్యమన్నట్టు ఎమ్మెల్యేలు, వారి అనుచరులే దగ్గరుండి దోచుకు తింటుంటే ఇసుకెలా దొరుకుతుంది?. – ఇప్పుడు ఆ నెపాన్ని ఉద్యోగుల మీద నెట్టి తప్పించుకోవాలని చూడటం విడ్డూరం. అప్పులపై దుష్ప్రచారం: – రాష్ట్ర అప్పుల విషయంలోనూ ఎన్నికలకు ముందు పథకం ప్రకారం రూ.14 లక్షల కోట్లు అని పచ్చి అబద్ధాలు ప్రచారం చేశారు. – కానీ, రాష్ట్ర అప్పులు కేవలం రూ.6.46 లక్షల కోట్లు మాత్రమే అని, వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వమే స్పష్టం చేసింది. – అయినా, మళ్లీ ఇప్పుడు పాత పాటే పాడుతూ, దుష్ప్రచారం చేస్తూ, గత మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. జగన్‌గారి వ్యక్తిత్వ హననానికి కుట్ర: – వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసినట్టు ఆ రోజున డీఎస్పీ మీడియాకు స్పష్టంగా తెలియజేశారు. ఆ విషయం ఎల్లో మీడియాలో కూడా ప్రచురితమైంది. అవన్నీ చంద్రబాబుకు కూడా తెలుసు. – అయినా జగన్‌గారి వ్యక్తిత్వ హననం చేయాలన్న కుట్రలో భాగంగా చంద్రబాబు నిన్న (శుక్రవారం) అసెంబ్లీలో, మళ్లీ అబద్ధాలు చెబుతూ, జగన్‌గారిపై ఆరోపణలు చేశారు. విమర్శలు గుప్పించారు. – దాన్ని ెల్లో మీడియా అలాగే ప్రచురించింది. మరింత దిగజారిన ఈనాడు నిస్సిగ్గుగా కన్నతల్లి శీలాన్ని శంకించే వారు మనుషులేనా?. అని ప్రచురించడం దుర్మార్గం. – ఆడబిడ్డలకు వైఎస్ జగన్ ఎంత గౌరవం ఇస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినా ఆయన గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్న వారిని ఏమని పిలవాలి?. – అంటే, మీరు ఏది మాట్లాడినా కరెక్ట్. అలాగే మేం ఏది మాట్లాడినా తప్పే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. చివరగా, ఏదేమైనా జీఎస్టీపై 1 శాతం సర్‌ఛార్జ్ వసూలును ఏ మాత్రం అంగీకరించబోమని మార్గాని భరత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు.