మీ రాజకీయాల కోసం పేదల ప్రాణాలు తీస్తారా బాబూ?

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్నినాని 

స్వచ్ఛంద సంస్థల ముసుగులో తప్పుడు రాజకీయం

చంద్రబాబుపై ఆయన కొడుక్కే నమ్మకం లేదు

ఎంత మంది వచ్చినా వైయస్‌ జగన్‌ను అంగుళం కూడా కదపలేరు

తెలంగాణ మంత్రులు ఏపీని ఉద్దరించాల్సిన పనిలేదు

తాడేపల్లి:  రాజకీయాల కోసం పేదల ప్రాణాలు తీస్తారా? అంటూ వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్నినాని చంద్రబాబును ప్రశ్నించారు.  సంక్రాంతి కానుక పేరుతో పేద ప్రజలకు ఆశ చూపిన చంద్రబాబు దుర్మార్గపు రాజకీయ క్రీడకు ముగ్గురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

 • చంద్రబాబు దుర్గార్గపు రాజకీయ క్రీడకు ముగ్గురు బలయ్యారు.
 • పార్టీ కార్యక్రమం పేరుతోనే పర్మిషన్‌ తీసుకున్నారు
 • టీడీపీ నేతలే సభకు అనుమతి తీసుకున్నారు
 • ఉయ్యూరు చారిట్రబుల్‌ ట్రస్ట్‌ కానుకలు పంచితే..జనసమీకరణ ఆ ట్రస్ట్‌ చేసిందా?
 • మనుషుల ప్రాణాలు పోయిన తరువాత మాట మారుస్తున్నారు
 • చంద్రబాబుకు సంబంధం లేదంటూ టీడీపీ నేతలు బుకాయింపు
 • ఘటన జరగ్గానే ఎల్లోమీడియా ప్లేట్‌ ఫిరాయించింది. ఘటనను ఎన్‌ఆర్‌ఐ సంస్థపై నెట్టి వేసే ప్రయత్నం చేసింది
 • 10 వేల మందికి కానుకల పంపిణీ అని పర్మిషన్‌ తీసుకుని, 30 వేల మందికి టోకెన్లు ఇచ్చారు. 
 • పేదల ప్రాణాలతో చెలగాటమాడటం నీచంగా అనిపించడం లేదా చంద్రబాబు
 • ఇంతకు ముందు కూడా రాష్ట్రంలో అమెరికా స్వచ్ఛంద సంస్థ పేరుతో టీడీపీ దుర్మార్గమైన కార్యక్రమాలు చేపట్టింది.
 • అడ్డదిడ్డమైన కార్యక్రమాలు ఇంకా కొనసాగించబోతున్నారా? 
 • టీడీపీ పేరు చెబితే జనాలు రావడం లేదన్న ఉద్దేశంతో స్వచ్చంద సంస్థల ముసుగులో అమెరికా నుంచి ఎవరినో ఒకరిని తీసుకువచ్చి టోకేన్లు పంచిపెట్టి అమాయక జనాలను మీ సభలకు తీసుకెళ్లే కిరాతకమైన క్రీడ కొనసాగించబోతున్నారా?
 • 2014 నుంచి చంద్రబాబుకు ఇదే ఖర్మ. గ్రాఫిక్స్‌కు, డ్రోన్‌ షాట్లకు అలవాటుపడ్డారు
 • చంద్రబాబుకు తన కొడుకు మీద నమ్మకం లేదు. కొడుకు పాదయాత్ర పేరుతో పోస్టర్‌ రిలీజ్‌ చేస్తే తండ్రి  ఫోటో లేదు
 • చంద్రబాబు బతికి ఉండగానే ఆయన ఫోటో లేకుండా లోకేష్‌ రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నాడు. కచ్చితంగా ఎన్టీఆర్‌ ఆత్మ పగ తీర్చుకుంటున్నారు.
 • చంద్రబాబుకు దత్త పుత్రుడిపై నమ్మకం ఎక్కువ. దత్తపుత్రుడేమో బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సైగ చేస్తుంటారు. కన్ను కొడుతుంటారు.
 • బీజేపీతో స్నేహం చేస్తున్న దత్తపుత్రుడు అంటే సీపీఐ రామకృష్ణకు ఇష్టం
 • వీళ్లందరికీ ఎల్లోమీడియా అంటే విఫరీతమైన ఇష్టం. ఎల్లోమీడియాకు వీరందరంటే ఎంతో మోజు
 • వ్యక్తిత్వం లేనివారితో మేం రోజు పోరాటం చేయడం మా దురదృష్టం
 •  కాంగ్రెస్‌ బీజేపీ, బీజేపీ సీపీఐ, సీపీఐ జనసేన, జనసేన తెలుగు దేశం, ఇంకా బీఎస్పీని కలుపుకున్నా మీ ఇష్టం. ఇలా అందరిని కలుపుకుంటే తప్ప వైయస్‌ జగన్‌తో పోరాటం చేయలేం.
 • వైయస్‌ జగన్‌ను ఓడించేందుకు కనీసం ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్థులకు ధైర్యం కావాలాంటే ఇంత మంది కలిస్తే కానీ నిలబడేందుకు అభ్యర్థులు దొరికే పరిస్థితి లేదని చంద్రబాబు, పవన్‌ ఆలోచిస్తున్నారు.
 • ఎంత మంది వచ్చినా వైయస్‌ జగన్‌ను అంగుళం కూడా కదపలేరు
 • ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు
 • ఏపీలో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో పోటీ పడుతుంది
 • తెలంగాణ మంత్రులు ఏపీని ఉద్దరించాల్సిన పనిలేదు
 •  
Back to Top