న్యాయ వ్యవస్థకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుందరరామశర్మ

శవ రాజకీయాలు చేయడమే చంద్రబాబుకి తెలుసు

వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు

కోర్టులను కూడా  మేనేజ్‌ చేయొచ్చంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు

న్యాయ వ్యవస్థ గురించి ఇంత చులకనగా మాట్లాడతారా

ఏ రోజైజా చంద్రబాబు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారా? 

ఎన్టీఆర్‌ నుంచి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు

తాడేపల్లి: న్యాయ వ్యవస్థకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సుందరరామశర్మ డిమాండు చేశారు. కోర్టులను కూడా  మేనేజ్‌ చేయొచ్చంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు శవరాజకీయాలు చేయడం బాగా ఆలవాటు అయ్యిందని ధ్వజమెత్తారు. తీరు మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సుందరరామశర్మ మీడియాతో మాట్లాడారు. 

 *రాక్షసుడికి పర్యాయ పదం చంద్రబాబు:*
    చంద్రబాబు ప్రెస్‌మీట్‌ చూశాం. అందులో కొన్ని విషయాలు చూస్తే, రాక్షసుడు అనే దానికి పర్యాయ పదం చంద్రబాబునాయుడు అనిపిస్తుంది.
రాక్షసులు ఇప్పుడు కూడా ఉన్నారు అనేది చంద్రబాబును చూస్తే తెలుస్తుంది. ఎంతసేపూ కుట్రలు, కుతంత్రాలు చేసి, రాష్ట్రంలో అలజడి సృష్టించి, ఈ ప్రభుత్వం పని చేయకుండా ఉండాలన్నది ఆయన లక్ష్యం. అందుకే శవ రాజకీయాలు చేస్తున్నాడు. తను  చేయలేనిది జగన్‌గారు చేస్తున్నారు కాబట్టి, తన పార్టీకి తెలంగాణలో మాదిరిగా అంతర్ధానం అవుతుందన్న వాస్తవంతో ఆయనలో ఒక ఫ్రస్టేషన్, ఒక ఆక్రోశం కనిపిస్తోంది.

*శవ రాజకీయాలకు కేరాఫ్‌..:*
    చంద్రబాబు శవ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. కానీ నిజానికి రాష్ట్రంలో ఆ శవ రాజకీయాలు చేస్తోంది చంద్రబాబునాయుడు. అచ్చం అభిలాష సినిమాలో ఓబులేశు పాత్రధారిలా. 
    1983లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు ఎన్నో శవ రాజకీయాలు చేశాడు. తొలుత మల్లెల బాబ్జీ, తర్వాత పింగళి దశరథరామ్, ఆ తర్వాత వంగవీటి రంగా.. ఇలా ఎందరి హత్యల్లో చంద్రబాబు శవ రాజకీయాలు చూశాం. హరికృష్ణ శవం పక్కనే కేటీఆర్‌తో రాజకీయాలు మాట్లాడాడు.
    చంద్రబాబు ఒక గుంటనక్క. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఉండడం నిజంగా దురదృష్టకరం అంటూ.. ఇటీవల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాటల వీడియో ప్రదర్శించారు.
    చంద్రబాబునాయుడుకు వ్యవస్థల మీద కానీ, వ్యక్తుల మీద కానీ ఎలాంటి అభిప్రాయం ఉన్నది అనేది వీడియో చూస్తే తెలుస్తుంది. అది చూస్తే చంద్రబాబు రాజకీయాల్లో 40 ఏళ్లు ఉన్నాడా? 14 ఏళ్లు సీఎంగా పని చేశాడా? అన్న అనుమానం కూడా యువతకు వస్తుంది.

*ఎంపీలు బ్రోకర్లా? ఏమిటా మాటలు?:*
    ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు. అసెంబ్లీ అనేవి దేవాలయాల వంటివి. వాటికి ఎన్నికయ్యే వారిని గౌరవంగా చూడాలి. కానీ రాజ్యసభకు ఎన్నికైన వారిని చంద్రబాబు బ్రోకర్లు అంటున్నాడు. కానీ చంద్రబాబు చేసిన పనులు, వ్యవస్థలను మేనేజ్‌ చేసి ఆయన చేసిన పనులు తెలిస్తే.. అసలు బ్రోకర్‌ ఎవరు అనేది తెలుస్తుంది.

*మాది సామాజిక న్యాయం:*
    మా పార్టీ నుంచి పరిమళ్‌ నత్వానీని రాజ్యసభకు పంపించడం జరిగింది. ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎంగారు ఆయనను ఎంపీగా చేశారు. కానీ చంద్రబాబు మాదిరిగా డబ్బులు తీసుకుని ఎవరినో పార్లమెంటుకు పంపలేదు. మా పార్టీ నుంచి 9 మంది రాజ్యసభ సభ్యులుంటే, వారిలో నలుగురు బీసీలు. 
    మరి చంద్రబాబు నీవెప్పుడైనా అలా బీసీలకు పదవులు ఇచ్చావా?
ఎంతసేపూ శవ రాజకీయాలు చేయడం తప్ప. వర్ల రామయ్యకు పదవి ఇస్తానని చెప్పి, మొండిచెయ్యి చూపించావు. అదే జగన్‌గారు సామాజిక న్యాయం పాటిస్తూ, నలుగురు బీసీలను రాజ్యసభకు పంపారు.

*వెంటనే క్షమాపణ చెప్పాలి:*
    న్యాయవ్యవస్థలో గౌరవ ప్రదమైన వ్యక్తి నిరంజన్‌రెడ్డి. ఆయనపైనా చంద్రబాబు విమర్శలు చేశారు. కోర్టులను కూడా ప్రభావితం చేస్తారని చంద్రబాబు అంటున్నాడు. అంటే అది ఆయనకు అలవాటు అని తెలుస్తుంది. న్యాయవృత్తి, న్యాయవాదులు, కోర్టుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని క్షమాపణలు చెప్పాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించబోరు.
    మనందరికీ బాగా గుర్తు. 1985లో ఎన్టీఆర్‌ నుంచి సీఎం పదవిని, పార్టీని లాక్కున్న ఓబులేశు చంద్రబాబునాయుడు. ఆరోజు ఏ విధంగా వ్యవహరించాడు అన్నది అందరూ చూశారు. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు చూశాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తిగా దిగజారి వ్యవహరించినా, ఆయన తనకు తాను నిప్పు అనుకుంటాడు. కాబట్టి ఆయన ఇప్పటికైనా తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారి.

*బాబూ నీకా దమ్ముందా?:*
    చంద్రబాబు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు. ఆయన మాటలు వింటుంటే మనందరి తలకాయలు పగులుతున్నాయి. మొన్న చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మాట్లాడినవన్నీ అబద్ధాలే.
    శవ రాజకీయాలు చేసే చంద్రబాబు ఒక విషయం చెప్పాలి. మీ గురించి ఎన్టీ రామారావు తన చివరి రోజుల్లో మాట్లాడిన మాటలకు మీకు దమ్ముంటే ధైర్యంగా సమాధానం చెప్పాలి. ఆనాటి ఎన్టీఆర్‌ మాటలకు మీరు సమాధానం ఇవ్వగలిగితే, మిమ్మల్ని ఓబులేశు అనం. మీరు శవ రాజకీయాలు చేస్తున్నారని అనం. మరి మీకు ఆ దమ్ము, ధైర్యం ఉందా?

*వైఖరి మార్చుకొండి:*
    ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి. తెలంగాణలో ఎలాగూ మీ పార్టీ లేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మీరు ఆరోజు సీబీఐని వ్యతిరేకించారు. రాష్ట్రంలో సీబీని రానివ్వబోమని అన్నారు. మీకు కేసుల భయం పట్టుకున్నట్లుంది.
    ఇప్పుడు చంద్రబాబు ప్రెస్‌మీట్‌ చూస్తే.. ఆయనలోని ఫ్రస్టేషన్‌ కనిపిస్తోంది. ఆయన మానసిక స్థితి కూడా బాగా లేదని అనిపిస్తోంది.
అందుకే ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి. ఓబులేశు మాదిరిగా శవ రాజకీయాలు చేయొద్దు. అలాగే మొన్నటి మాటలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి.

*లోకేశ్‌.. నీవసలు నాయకుడివా?:*
    చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను పెంచినట్లుగా ఎవరూ తన బిడ్డను పెంచొద్దు. అలా చేస్తే లోకేశ్‌ మాదిరిగా తయారవుతారు. ఆనాడు జగన్‌గారు 3600 కి.మీకు పైగా పాదయాత్ర చేశారు. అడుగడుగునా ఆయన వెంట జనం తరలి వచ్చారు. అందుకే అది ప్రజా సంకల్ప యాత్ర అయింది.
    మరి లోకేష్‌ నీ వెంట ఎవరూ రావడం లేదు. నీకసలు మాట్లాడడం కూడా రావడం లేదు. స్పష్టంగా మంగళగిరి, యువగళం అని కూడా పలకలేవు. నీవు నేతవు ఎలా అవుతావు? 
అంటూ.. లోకేశ్‌ స్పష్టంగా పలకలేని మాటలు, బండ బూతు మాటల వీడియో ప్రదర్శన.

*లోకేశ్‌ది బూతు యాత్ర:*
    లోకేశ్‌ పాదయాత్ర మొదలుపెట్టి, బూతు యాత్ర చేస్తున్నాడు. ఆయనలో కూడా ఫ్రస్టేషన్‌ కనిపిస్తోంది. తన తండ్రి మీద కోపం కనిపిస్తోంది. తన నాన్న, దుష్ట చతుష్టయం తనపై కుట్ర చేశారన్న కోపం కనిపిస్తోంది. ఎందుకంటే తన యాత్రలో జనం లేరు. ఎల్లో మీడియా కూడా తన నాన్నను చూపించినట్లు తనను చూపించడం లేదన్న కోపం లోకేష్‌లో కనిపిస్తోంది. ఆ ఫ్రస్టేషన్‌లో జగన్‌గారిపై పిచ్చి విమర్శలు చేస్తున్నాడు.

*మీ నాన్నకే భయం:*
    నాయనా లోకేశ్‌.. భయం అనేది మీ నాన్నకు ఉంది. అందుకే పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి కడప ఎంపీగా పోటీ చేసిన జగన్‌గారిని ఓడించాలని ఆనాడు మీ నాన్న విశ్వ ప్రయత్నం చేశాడు. అయినా జగన్‌గారు 5 లక్షలకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించారు. కానీ నీవు ఇప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. మీ ఎమ్మెల్సీ పదవి కూడా ముగుస్తోంది.
    ఆనాడు 1983లో మీ నాన్న తెలుగుదేశం పార్టీలో చేరినా, ఓడిపోతానన్న భయంతో ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తర్వాత కూడా మీ తాత నుంచి పార్టీని, పదవిని లాక్కున్నాడు తప్ప, ఆయనకూ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం కానీ, దమ్ము కానీ లేదు. అందుకే మీ నాన్నకే భయం. మా జగన్‌గారు ఎంతో ధైర్యవంతులు. ఆయన ఎన్నింటినో ఒంటరిగా ఎదుర్కొన్నారు.

*యాత్ర ముగించు:*
    లోకేశ్, నీకు చెప్పేది ఒక్కటే. జగన్‌గారిపై నీ భాష.. నీలో ఉన్న భయాన్ని, మీ నాన్నపై ఉన్న కోపాన్ని చూపుతోంది. మీ నాన్న శవ రాజకీయాలు చేయడంలో గొప్పవాడు. ఆయన తన స్వార్థం కోసం దేనికైనా తెగిస్తాడు. నీకూ పాదయాత్ర ముగించాలని ఉంది. అందుకే ఈ విధంగా పిచ్చిగా మాట్లాడుతున్నావు. అయితే నీవెన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మబోరు. వారు నీ వెంట రాబోరు. 
    నీవు నీ యాత్రను ఎంత త్వరగా ముగించుకుని ఇంటికి వస్తావా అని అక్కడ మీ తల్లిదండ్రులతో పాటు, ప్రజలూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే ఆ పని చేసి, యాత్ర ముగించు.

తాజా వీడియోలు

Back to Top