మతి తక్కువ మాటలు మానుకో బాబూ

అమరావతి గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు

ఆకాశం మీద ఉమ్ము వేయాలనుకుంటే నీ మీదే పడుతుంది

అనుభవంతో శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించలేదు

ఒక కిలోమీటర్‌ రోడ్డు నిర్మాణానికి రూ.42 కోట్లా..?

అమరావతిని చంద్రబాబు భ్రమరావతి స్కామ్‌గా మార్చాడు

రైతులు విసిరిన చెప్పు దొరికితె బాటా కంపెనీని ప్రశ్నిస్తావా..?

ఓటు ఇక్కడ.. ఇల్లు హైదరాబాద్‌లో కావాలా..? ఇదేనా అమరావతిపై ప్రేమ

రాజధానిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తాం

అవినీతికి తావులేకుండా ప్రజారాజధానిని నిర్మిస్తాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

 

తాడేపల్లి: ఐదేళ్లు అమరావతి ప్రాంతాన్ని దోచుకొని ప్రతిపక్షంలోకి రాగానే అమ్మో అమరావతి అంటూ చంద్రబాబు గుండెలు బాదుకుంటున్నాడు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు మతి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఆకాశంపై ఉమ్ము వేయాలనుకుంటే అది నీ మీదే పడుతుంది చంద్రబాబూ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నిన్న రాజధాని ప్రాంతంలో హల్‌చల్‌ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఓటమి పాలైన తరువాత విషయం ఉన్నా.. లేకపోయినా.. ఏదో ఒక గందరగోళాన్ని, ఒక అలజడిని సృష్టించాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడని అంబటి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘తెలుగుదేశం కార్యకర్తలపై వైయస్‌ఆర్‌ సీపీ వారు దౌర్జన్యం చేస్తున్నారని కొంత అలజడి సృష్టించడానికి చలో ఆత్మకూరుతో ప్రయత్నం చేశారు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని వైయస్‌ఆర్‌ సీపీపై రుద్దేందుకు చూశాడు. ఆ తరువాత ఇసుక, ఇంగ్లిష్‌ మాధ్యమంపై గందరగోళం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధాని మీద ఏదో గందరగోళం చేయాలని పర్యటన చేశాడు. రాజధానిలో పర్యటించాల్సిన ఆవశ్యతక, అవసరం ఏముందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షనేతపై ఉంది.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు అవుతుంది. అమరావతిలో ఏవిధమైన అభివృద్ధి చేయలేదని స్పష్టంగా మేమే చెబుతున్నాం. అమరావతిపై మాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. చంద్రబాబు అమరావతిని ఒక భ్రమరావతిగా మార్చి పెద్దస్కామ్‌గా తయారు చేశాడు. వేల కోట్లు దోచుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిపై కమిటీ వేసి విచారణ చేస్తున్నాం. బాబు ఐదేళ్ల పరిపాలన తీరు అన్యాయం, అక్రమం. విపరీతమైన దోపిడీ చేశారు. రూపాయి ఖర్చు అయ్యే చోట రూ.10 కేటాయించి రూ.9 మీ జేబుల్లో వేసుకున్నారు.

ప్రతిపైసా ప్రజలకు ఉపయోగపడాలనే తాపత్రయంతో సీఎం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. దుబారాను పూర్తిగా అరికట్టాం. ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టులకు దోచిపెట్టి ముడుపులు స్వీకరించే చంద్రబాబు ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు రివర్స్‌టెండరింగ్‌ తీసుకువచ్చి రూ.వేల కోట్లు ఆదా చేశాం. రాజధాని మంచిగా నిర్మించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఉంటే గందరగోళం సృష్టించి అమరావతి గొంతు పిసికేస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అమరావతిని పెంచి పోషించావా..? ఏముందని అమరావతిలో..? ఎన్ని అద్బుతమైన బిల్డింగ్‌లు కట్టావు..? ఇంటి నుంచి బయల్దేరి పది నిమిషాల్లో అమరావతిలో పర్యటన చేయొచ్చు. నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఐదేళ్లలో ఏం నిర్మించావు చంద్రబాబూ. అన్ని తాత్కాలికమే.. శాశ్వతం జోలికి ఎందుకు వెళ్లలేదు. పాత రాజధానిలో పది సంవత్సరాలు ఉండండి అని చెబితే ఎందుకు పారిపోయి వచ్చావు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు ఎందుకు శాశ్వత అసెంబ్లీ నిర్మించలేదో సమాధానం చెప్పాలి. అమరావతిలో ఎంత ఘోరం ఎందుకు జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగాలి.

Read Also: విజయవాడ నగర అభివృద్ధికి చర్యలు 

అమరావతిలో చెరకు, అరటి తోటలు తగలబెట్టించి కడప నుంచి వైయస్‌ జగన్‌ మనుషులు వచ్చారని బురదజల్లాడు. ఆ కేసులో నిందితులను పట్టుకున్నారా..? ప్రస్తుత బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను నిర్బంధించి అనేక ఇబ్బందులు పెట్టారు. రైతులపై ఎన్ని కేసులు పెట్టారో చంద్రబాబు మరిచిపోయారా..? పూలింగ్‌ పేరుతో బెదిరించి అనేక అక్రమాలు, అన్యాయాలు చేశారు. ఎస్సీలకు చెందిన భూములను బాబు తాబేదారులతో కొనిపించి వారికి స్థలాలు కేటాయించారు.

చంద్రబాబు పెద్ద లాఠీ చూపించి మాపై విసిరారు. దీనికి డీజీపీ, ఐజీ సమాధానం చెప్పాలని అంటున్నాడు. చెప్పు, రాయి విసిరారని విన్నాం.. ఆ చెప్పు దొరకలేదా..? చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ ఆ కంపెనీ సమాధానం చెప్పాలని మాట్లాడుతాడేమో..? మంగళగిరిలో మీ అబ్బాయి.. మీ ఆశాజ్యోతిని తుక్కుగా ఓడించారే.. బాబుపై ప్రజలకు అంత గౌరవం, ప్రేమ ఉన్నాయి. అందరినీ మోసం చేశారు కాబట్టే నిరసన తెలిపారు. చెప్పు, రాళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే.

ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వస్తుంటే టీడీపీ నిరసన తెలిపింది. నల్లజెండాలు పట్టుకొని ఊరేగారు. మళ్లీ ఇవాళ ప్రధానిపై చంద్రబాబుకు ప్రేమానురాగాలు పెరిగిపోయాయి. 35 నదుల నీరు, 13 వేల పంచాయతీల మట్టి తీసుకువచ్చారంట. విధి చాలా విచిత్రమైనది.. చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు మామ ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానని చెప్పాడు. తెలుగుదేశంలోకి ప్రవేశించి కర్షక పరిషత్‌ అధ్యక్షుడిగా, రెవెన్యూ మంత్రిగా, ఎన్టీఆర్‌ను దించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును 40 ఏళ్లుగా పరిశీలిస్తూనే ఉన్నాం. మోడీ రాయి వేసిన దగ్గర సాష్టాంగ నమస్కారం పెట్టారు. చేసిన పాపాలు అన్నీ పరిష్కారం కావాలని పెట్టావా.. మోడీపై ప్రేమ ఉండి పెట్టావా..? లేక అమరావతిలో దోచుకున్నానని ప్రేమతో పెట్టావా..? వంగినా, సాష్టాంగం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు.

ఐదు సంవత్సరాల్లో ఖర్చు చేసింది రూ.5800 కోట్లు. ఒక కిలోమీటర్‌ రోడ్డు నిర్మించడానికి రూ.42 కోట్లు కేటాయించాడు. జాతీయ రహదారులు నిర్మిస్తే రూ.15 కోట్లు అవుతాయి.. రూ.42 కోట్లు కిలోమీటర్‌కు ఖర్చు చేశావంటే ఎవరి సొమ్ము అనుకున్నావు. చదరపు అడుగుకు భవనం కట్టేందుకు రూ.15 వందల నుంచి రూ.2 వేలు అవుతాయి. చంద్రబాబు రూ.6 వేల నుంచి రూ.11 వేలు ఇచ్చాడు. ప్రజల సొమ్మంతా కాంట్రాక్టుల రూపంలో కాజేశాడు.

అవినీతిని అరికట్టడమే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం. స్వచ్ఛమైన పాలన, అవినీతిరహిత పాలన అందించాలని పనిచేస్తుంటే అమ్మో అమరావతి అంటూ చంద్రబాబు గుండెలు బాదుకుంటున్నాడు. అమరావతి నిర్మాణంపై అంత ఆకాంక్ష ఉంటె ఎందుకు ఇల్లు కట్టుకోలేదు. ఓటు అయితే ఇక్కడ.. ఇల్లు అయితే హైదరాబాద్‌లో కావాలా..? నది ఒడ్డున కట్టిన అక్రమ నిర్మాణంలో ఉంటూ అమరావతి గురించి ప్రశ్నించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. బాబు మతితక్కువగా మాట్లాడడం సరైన విధానం కాదు. ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రయత్నిస్తే అది జరగదు. ఆకాశం మీద ఉమ్ము వేస్తే మీ ముఖం మీదే పడుతుందని గుర్తుంచుకోండి చంద్రబాబూ అని అంబటి సూచించారు.

Read Also: విజయవాడ నగర అభివృద్ధికి చర్యలు 

Back to Top