ఎల్లో గ్యాంగ్‌ విష ప్రచారాలను తిప్పి కొట్టాలి

వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు

స‌చివాల‌య క‌న్వీన‌ర్లు, గృహ సార‌ధుల‌కు వైవీ సుబ్బారెడ్డి దిశానిర్దేశం

విజ‌య‌న‌గ‌రం: ప్రతిపక్షాల కుట్రలు పచ్చ మీడియా విష ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పై ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. చీపురుపల్లి రాధా మాధవ కళ్యాణమండపంలో చీపురుపల్లి నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం, గరివిడి మండలం జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారధుల మా నమ్మకం నువ్వే జగన్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి,  రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 
రాష్ట్ర ప్రజలు ఏ నమ్మకంతో అయితే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారో ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం పైగా అమలు చేసి అనేక ఇతర కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించిన నేపథ్యంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంతో సచివాలయం కన్వీనర్లు మరియు గృహ సారధులు ప్రతి గడపకు వెళ్లి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు చేపడుతున్న సంక్షేమ,  అభివృద్ధి పరిపాలనను వివరించి.. 2024 ఎన్నికల్లో తిరిగి మళ్ళీ అత్యధిక మెజారిటీతో జగ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తూ.. ప్రతిపక్షాల కుట్రలను, పచ్చ మీడియా దృశప్రచారాలను తిప్పుకొట్టేందుకు సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు ప్రజల మధ్య నిరంతరం తిరుగుతూ..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారు చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి అని సూచించారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ,  విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్,  శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు, నియోజకవర్గ పరిశీలకులు నిమ్మాన దాస్, పలాస నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కెవి సూర్యనారాయణ రాజు (పులి రాజు), ఎంపీపీలు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు

Back to Top