ఇది కాదా బురద రాజకీయం?

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అంత హ‌డావుడిగా అరెస్టు చేయాల్సి అవ‌స‌రం ఏంటి?

ప‌ల‌క‌రించేందుకు స్టేష‌న్‌కు వెళ్తే నాపై కూడా కేసు పెడ‌తారట‌

ద‌ళితులంటే అంత చిన్న చూపా?

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ఆగ్ర‌హం

మంగ‌ళ‌గిరి: వ‌ర‌ద‌ల కార‌ణంగా విజ‌య‌వాడ‌లో వేలాది మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులుగా మారితే వారిని ఆదుకోవాల్సిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బుర‌ద రాజ‌కీయాల‌కు తెర లేపార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలన‌ను గాలికొదిలి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం సిగ్గు చేట‌ని మండిప‌డ్డారు. 
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అరెస్ట్ అక్ర‌మ అరెస్టును ఆయ‌న తీవ్రంగా ఖండించారు. గురువారం మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మీడియాతో మాట్లాడారు. 

సుధాక‌ర్ బాబు ఏమ‌న్నారంటే..
సురేష్‌ గారిని అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌ నుంచి అరెస్ట్‌ చేసి తీసుకొచ్చారు, ఆయన పట్ల అవమానకరంగా వ్యవహరించారు, అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఉన్న ఆయన్ను అంత హడావిడిగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏంటి, మూడేళ్ళ క్రితం కేసులో పోలీసులు చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు కానీ టీడీపీ అధికారంలోకి రాగానే దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు, నేను వైయ‌స్‌ఆర్‌సీసీ ఎస్‌సీ సెల్‌ అధ్యక్షుడిగా, మాజీ ఎమ్మెల్యేగా కనీసం పలకరించడానికి వెళితే కూడా పోలీసులు అనుమతించడం లేదు, మా దళితులంటే అంత చిన్న చూపా, ఇది కాదా అంటరానితనం. పైగా మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, ఇదేనా చంద్రబాబు మీ పాలన, మా పార్టీ నాయకులను టార్గెట్‌ చేసి చిత్రహింసలు పెట్టాలని చూసినా ఎవరూ వెనక్కి తగ్గరు, మీరు చేస్తున్న వికృత చేష్టలు ప్రపంచం గమనిస్తుంది, ఇది కాదా బురద రాజకీయం, ప్రజలు చీత్కరించుకుంటుంటే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు, సురేష్‌ కార్యకర్త స్ధాయి నుంచి ఎంపీ స్ధాయికి ఎదిగారు, మీ ఆకృత్యాలకు పోలీసులు కూడా సహకరించడం దారుణం, కచ్చితంగా పోరాడతాం, మీకు బుద్దిచెబుతాం, తప్పుడు కేసులు చట్టపరంగా ఎదుర్కొంటామ‌ని టీజేఆర్ సుధాక‌ర్ బాబు పేర్కొన్నారు.

Back to Top