నేడు వెంక‌ట‌గిరి, రాజోలులో సామాజిక సాధికార యాత్ర  

తాడేపల్లి :   వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్రలో భాగంగా నేడు(శుక్రవారం) తిరుపతి, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సాగనుంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జ్‌ నేదురమల్లి రామ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నేదురమల్లి బంగ్లా నుండి ప్రారంభమయ్యే ర్యాలీ ఉక్కిలి మీదుగా రాపూరు వరకు జరుగనుంది. అనంతరం మూడు గంటలకు రాపూరు మెయిన్‌ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు హాజరుకానున్నారు.

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో జరిగే బస్సుయాత్రలో భాగంగా మధ్యాహ్నం గం. 1.30కి మల్కిపురంలోని కేఎస్‌ఎన్‌రాజు నివాసంలో  వైయ‌స్ఆర్‌సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభం అవుతుంది. మూడు గంటలకు మల్కిపురం ప్రధాన సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.  ఈ సభకు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరుకానున్నారు.

Back to Top