సీఎం వైయ‌స్ జగన్‌ను గద్దె దించ‌డం ఆ పార్టీలకు సాధ్యం కాదు

ప్రొద్దుటూరు స‌భ‌లో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌
 

ప్రొద్దుటూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైయ‌స్ఆర్‌సీపీకి అండగా ఉన్నంత వరకూ సీఎం వైయ‌స్ జగన్‌ను గద్దె దించాలని చూడటం ఆ పార్టీలకు సాధ్యం కాద‌ని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్ పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  సామాజిక సాధికారిత బస్సుయాత్ర మూడో రోజులో భాగంగా ప్రొద్దుటూరు శివాలయ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలువురు నేతలు ప్రసంగించారు.

మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘ మునుపెన్నడూ లేని విధంగా అధికారంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. బీసీల ధైర్యం సీఎం వైయ‌స్‌ జగన్‌.  2019కి ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీలో ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. సామాజిక సాధికారిత బస్సుయాత్రను నల్లబ్యాడ్జిలతో అడ్డుకుంటామని లోకేష్‌ అంటున్నాడు. 

చేసిన తప్పుకు తండ్రి చంద్రబాబు జైల్లో ఉంటే తనయుడు లోకేష్‌ ఐదు రోజులు రాష్ట్రంలో లేడు. జైల్లో వేస్తారనే భయంతో ఢిల్లీకి పారిపోయాడు. తప్పులన్నీ రెడ్ బుక్‌లో రాస్తున్నాను అంటున్న లోకేష్  2024 తరువాత ఆ రెడ్ బుక్ మడిచి ఎక్కడ పెట్టుకుంటాడు. ఎవరైనా తాను ముఖ్య మంత్రి కావాలని పార్టీ పెడతారు.. దత్త పుత్రుడు మాత్రం చంద్ర బాబు సీఎం కావాలని పార్టీ నడుపుతున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైయ‌స్ఆర్‌సీపీకి అండగా ఉన్నంత వరకూ సీఎం వైయ‌స్ జగన్‌ను గద్దె దించాలని చూడటం ఆ పార్టీలకు సాధ్యం కాదు’ పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. ‘75 ఏళ్ల భారత దేశంలో సామాజిక న్యాయం అనేదానికి సార్థకత కల్పించారు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మంత్రి వర్గ కూర్పులో బీసీలకు, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ బీసీలకు చేసేందేమీ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికార దిశగా చేయిపట్టుకుని వైయ‌స్ఆర్‌సీపీ ముందుకు నడిపిస్తోంది.  గత ప్రభుత్వంలో ఒక్క ఎస్సీ మంత్రి లేరు. కేవలం ఎన్నికలు దగ్గర పడ్డాక మైనార్టీలకు టీడీపీ పదవులు ఇచ్చింది. సీఎం వైయ‌స్ జగన్‌ సారథ్యంలోని వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అన్ని వెనుక బడిన వర్హాకు రాజకీయ అవకాశాలు కల్పించే దిశగా 50 శాతం రిజర్వేషన్ కల్పించింది. నవ రత్నాలు ద్వారా రాష్ట్రం లోని ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. 

ఎంపీ బీద మస్తాన్‌ రావు మాట్లాడుతూ..  ‘తండ్రికి మించిన తనయుడిగా సీఎం వైయ‌స్ జగన్‌ ప్రజా సంక్షేమ పథకాలను విజయవతంగా అమలు చేస్తున్నారు. కార్పోరేట్‌ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి వైయ‌స్ఆర్  తీసుకువస్తే, వేల రోగాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే. 

టిడిపి గత ఎన్నికల్లో  ఇచ్చిన మనిపెస్తో అమలు చేయలేదు. వైయ‌స్ జగన్ ఇచ్చిన మాటకు కట్టబడి నవరత్నాలు అందించారు.నేను 30 ఏళ్లు టిడిపిలో ఉన్నా ఎంపి పదవి ఇస్తానని చెప్పి మోసం.చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ పదవి ఇచ్చి నాకు న్యాయం.చేసింది. నాలాంటి ఎంతో మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు సముచిత స్థానం కల్పించారు.

Back to Top