ఇచ్చాపురం నుంచి సామాజిక సాధికార బ‌స్సు యాత్ర ప్రారంభం

పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే 

వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

శ్రీకాకుళం జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇచ్చాపురం నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని పార్టీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరదు కల్యాణి పాల్గొన్నారు.

గత నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం వైయ‌స్ జగన్‌. అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందించాం. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు సీఎం వైయ‌స్‌ జగన్‌. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని వారికి సంక్షేమ  పథకాలు అందించాం. సీఎం వైయ‌స్ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రతీ నాయకుడూ, కార్యకర్త పనిచేస్తున్నారు, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం వైయ‌స్ జగన్‌దే అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు.

 

Back to Top