మే 3న సీఎం విశాఖ పర్యటన.. ఈ తరం అభివృద్ధికి ఎంతో కీలకం

వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

విశాఖపట్నం: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మే 3వ తేదీన విశాఖలో సీఎం వైయస్‌ జగన్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, అధికారులతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్న ప్ర‌దేశాల్లో ఏర్పాట్లు, బ‌హిరంగ స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను వైవీ సుబ్బారెడ్డి ప‌రిశీలించారు. అధికారుల‌కు తగు సూచ‌న‌లు చేశారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని చెప్పారు. విశాఖపట్నంలో టెక్నాలజీ పార్కు ద్వారా ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి లభించనుందన్నారు. ఈనెల 3వ తేదీన సీఎం వైయస్‌ జగన్‌ పర్యటనలో శ్రీకారం చుట్టున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ తరం అభివృద్ధికి ఎంతో కీలకం కాబోతుందన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top