చంద్రబాబు రాయలసీమ ద్రోహి

లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ తరలింపు నిర్ణయం దారుణం

వైయ‌స్ఆర్‌సీపీ రాయలసీమ నేతల ధ్వజం

రాయలసీమపై వైయస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ

ఆ దిశలోనే లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు

వాటిని అమరావతికి తరలించాలని ప్రభుత్వ నిర్ణయం

ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న రాయలసీమ నేతలు

మా ప్రాంత ప్రజల అభిప్రాయాలు, మనోభావాలు పరిగణించాలి

తరలింపు నిర్ణయంపై పునరాలోచించాలి. నిర్ణయం మార్చుకోవాలి

ప్రభుత్వ నిర్ణయం మారేలా ఈ ప్రాంత నేతలంతా కలిసి పోరాడాలి

వేర్వేరు ప్రెస్‌మీట్లలో వైయ‌స్ఆర్‌సీపీ రాయలసీమ నేతల పిలుపు

రాయ‌ల‌సీమ‌:  చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ వైయ‌స్ఆర్‌సీపీ రాయ‌ల‌సీమ నేత‌లు ధ్వ‌జ‌మెత్తారు. క‌ర్నూలులోని లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ తరలింపు నిర్ణయం దారుణంపై వైయ‌స్ఆర్‌సీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు సీమలో పెట్టాలి.. కానీ పెట్టలేదు. అందరూ విస్మరించినా దివంగత నేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారు. హైకోర్టు కోసం బార్ కౌన్సిల్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వైయ‌స్‌ జగన్ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సీబీఐ కోర్టు కర్నూలులో ఏర్పాటైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు చెప్పారు. వైయ‌స్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలులో వేర్వేరుగా  వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, బీవై రామయ్య మీడియాతో మాట్లాడారు. 

YSRCP Ravindranath Reddy Fires On Chandrababu

కడప వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఏమన్నారంటే..:
– రాయలసీమకు తొలి నుంచి అన్యాయం జరుగుతోంది. గతంలో ఏ పాలకులూ ఈ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 
– చివరకు శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమలో పెట్టాలన్నారు. దాని కోసం బార్‌ కౌన్సిల్‌ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోయింది. హైకోర్టు ఏర్పాటు కాలేదు.

– ఒక్క వైయ‌స్ఆర్ , వైయస్‌ జగన్‌ హయాంలోనే రాయలసీమకు మేలు జరిగింది
– వైయ‌స్ జగన్‌ కర్నూలులో హెచ్‌ఆర్సీ, వక్ఫ్‌ ట్రిబ్యునల్, లోకాయుక్త, సీబీఐ కోర్టు ఏర్పాటు చేశారు. మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలని మూడు రాజధానుల్లో కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు.
– రెండో లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెట్టాలని ఆలోచించి భూమితో పాటు, రూ.100 కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఇప్పుడు దాన్ని కూడా చంద్రబాబు తరలించుకుపోయారు.

– గతంలో హైదరాబాద్‌ ఒకే రాజధానిగా ఉండడం వల్ల చాలా నష్టపోవాల్సి వచ్చింది, అలా జరగకూడదని వైయస్‌ జగన్‌ ఆలోచించారు.
– కొప్పర్తి ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను కూడా అమరావతికి తరలించుకుపోయారు.
– టీడీపీని ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్‌ దీనిపై సమాధానం చెప్పాలి.
– రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు స్పందించాలి. రాయలసీమ అభివృద్ధి కోసం కలిసి వచ్చే వారితో మేము కలిసి పని చేస్తాం. ఆందోళన చేస్తాం.

అనంతపురం వైయ‌స్ఆర్‌సీపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఏమన్నారంటే..:
– చంద్రబాబు రాయలసీమ ద్రోహి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది విఘాతం.
– కర్నూలులో ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను అమరావతికి తరలించే ప్రయత్నం దుర్మార్గం. వెనకబడిన ప్రాంతాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు.
– రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేయద్దు. ఇలాంటి ఆలోచనలు విరమించుకోవాలి.

– కర్నూలును వైయస్‌ జగన్‌ జ్యూడిషియల్‌ క్యాపిటల్‌గా ఏర్పాటు చేశారు
– అభివృద్ది వికేంద్రీకరణ జరగాలని శ్రీకృష్ణ, శివరామకృష్ణన్‌ కమిటీలు చెప్పాయి. అభివృద్ది కేంద్రీకరణ జరిగితే విభజన సమస్యలు వస్తాయని స్పష్టంగా చెప్పారు.
– అన్నీ అమరావతిలోనే ఏర్పాటు చేస్తే ప్రాంతీయ అసమానత ఏర్పడుతుంది.
– రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకోలేదా?. చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో మొండిగా ముందుకెళ్తున్నారు. రాయలసీమకు మంజూరైన ప్రాజెక్ట్‌లన్నీ అమరావతికి తరలిస్తే ఎలా?
– చంద్రబాబుకు అమరావతి ధ్యాస తప్ప మరో ధ్యాస లేదా? రాయలసీమకు అన్యాయం చేయద్దు. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
– ఇకనైనా రాష్ట్ర విభజన నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. ఇదే పరిస్ధితి కొనసాగితే రాయలసీమ మరింత వెనకబాటుకు గురవుతుంది.
– ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలకతీతంగా రాయలసీమ ప్రాంత నేతలంతా గొంతెత్తి నిలదీయాలి. 

BY Ramaiah YSRCP

కర్నూలు క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మేయర్‌ బీవై రామయ్య ఏమన్నారంటే..:
– రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు ఏ రోజూ ఆలోచన చేయలేదు.
– ఇప్పుడు కూటమిలోని అన్ని పార్టీలు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాయి
–  వైయస్‌ జగన్‌ అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలని తాపత్రయపడ్డారు. కర్నూలును న్యాయరాజధానిగా చేయాలని అనేక చర్యలు తీసుకున్నారు. నేషనల్‌ లా యూనివర్సిటీకి శిలాఫలకం వేశారు.

– చంద్రబాబు మీరు అమరావతిలో కొత్త సంస్ధలు ఏర్పాటు చేసుకోండి. కానీ, ఈ ప్రాంతంలోని సంస్ధలు అక్కడికి తరలించవద్దు.
– రాయలసీమ వాసులు బిచ్చగాళ్ళు కాదు. మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు.
– రాయలసీమకు నష్టం జరిగితే చూస్తూ ఊర్కోబోము. ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ ప్రాంత కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?
– చంద్రబాబు దుర్మార్గ చర్యలు అడ్డుకుంటాం. ఈ ప్రాంత వాసులుగా మేం ప్రాణత్యాగానికైనా సిద్దం. ఆమరణ దీక్షలు చేసి సాధించుకుంటాం. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే వైయ‌స్ జగన్‌ మళ్లీ సీఎం కావాలి.

Back to Top