సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న దేశానికే ఆద‌ర్శం

2024 ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే సిద్ధం కావాలి

వైయ‌స్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ 

తాడేప‌ల్లి: అనేక ఆటుపోట్లు అధిగమించి దివంగత మ‌హానేత‌ వైయ‌స్‌ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధ‌నే లక్ష్యంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్ప‌డింద‌ని పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ అన్నారు. పార్టీ ప్రారంభం నుంచి బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా, పోరాట యోధుడిగా, మడమ తిప్పని ప్రజాభిమానం కలిగిన నాయకుడిగా, ఎన్నికల్లో అశేషమైన ప్రజాభిమానం చూరగొన్న నాయకుడిగా వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడమే కాకుండా, జాతీయ స్థాయిలో సంక్షేమ రథసారధిగా, రాజకీయ వ్యవస్థలో లోపాలను సరిదిద్దుతూ, ప్రజా పరిపాలనే లక్ష్యంగా, వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ పాలనాధక్ష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారన్నారు.  
    
తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వానికి హాజ‌రైన ఎంపీ మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రరాష్ట్రంలో సీఎం వైయ‌స్‌ జగన్ నాయకత్వంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా ఉన్నాయ‌న్నారు. ఇంత గొప్ప పరిపాలన చేస్తుండబట్టే జాతీయ స్థాయిలో సీఎం వైయ‌స్‌ జగన్ పాలనాధక్ష్యుడిగా పేరు తెచ్చుకున్నారన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వనంతగా.. సీఎం వైయ‌స్‌ జగన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివిధ హోదాల్లో గుర్తింపును ఇచ్చారని గుర్తుచేశారు. అయితే.. పదవులు, గుర్తింపు రావడం అనేది నాలుగురోజులు ముందూ వెనుకా అవ్వొచ్చేమోగానీ, అందరికీ సముచిత స్థానం, గౌరవం ఇస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కార్యోన్ముకులై సిద్ధం కావాల‌న్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా, 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పని చేయాలని సూచించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top