రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఆరేళ్ల పండుగ‌

 అమ‌రావ‌తి: ప్రజా సంకల్పయాత్రలో అన్ని వర్గాలను పలకరించిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ రాష్ట్రంలో సంక్షేమ బాట పరిచారని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు కొనియాడారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు రాష్ట్ర‌మంత‌టా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అన్నదానాలు, పేదలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి నాయకులు సేవాభావం చాటుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్‌ కట్‌ చేసిన అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడారు.   

 
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు  తెలిపారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం వైయ‌స్‌ జగన్‌ వారి గుండెల్లో నిలిచారన్నారు.  

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని ఎమ్మెల్యే తొగూరు ఆర్థ‌ర్‌  అన్నారు. నందికొట్కూరులో వైయ‌స్ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పరిపాలనలో తనదైన మార్కు చూపించారని కొనియాడారు.  
రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్ర‌జా సంక్షేమానికి నాంది పలికిన మహా ఘట్టం ‘ప్రజా సంకల్ప యాత్ర’ అని అభివర్ణించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు వర్తింపజేసి.. జనం మెచ్చిన నేతగా వైయ‌స్ జగన్‌ నిలిచిపోయారన్నారు. 
సంక్షేమ పాలన ద్వారా జగన్‌ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. అమడగూరు మండలం గొల్లపల్లిలో భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్‌ చేసి నాయకులు, పిల్లలకు పంచిపెట్టారు.   
 
మడకశిర పట్టణంలోని వైయ‌స్ఆర్‌ సర్కిల్‌లో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే తిప్పేస్వామి వైయ‌స్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితోనే సీఎం వైయ‌స్ జగన్‌ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. 

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు  ఆరేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని మ‌హానేత‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అరి్పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు.   

Back to Top