తాడేపల్లి: డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తెలుగుదేశం పార్టీ తన అనుకూల పత్రికలు, సోషల్ మీడియా ద్వారా వైయస్ జగన్ గారి కుటుంబసభ్యులపైనా, ఆయన పీఏ పైనా భూ కుంబకోణం ఆరోపణలు చేయిస్తోందని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రగులుతున్న అసంతృప్తి నుంచి వారి దృష్టిని మళ్ళించేందుకు ప్రతినెలా ఒక అంశంతో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ గత రెండు రోజులుగా ఎల్లో మీడియాలో, సోషల్ మీడియాలో తెలుగుదేశం అనుకూల పత్రికల్లో రూ.700 కోట్ల కుంబకోణం అంటూ ఊదరగొడుతున్నారు. రాష్ట్రం అంతా భూములను వైయస్ జగన్ గారు, వారి అనుచరులు దోచుకున్నారని పెద్ద ఎత్తున దుష్ర్పచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటుగా మారింది. ప్రతినెలా ఒక అంశాన్ని తీసుకుని, దానిచుట్టూ ఒక కథను అల్లడం, దానిపైన అభూత కల్పనలను జోడించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన బురదచల్లడం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అసాంఘిక శక్తుల విజృంభణ, వారి అరాచకాలు, మరోవైపు హామీలను అమలు చేయలేని నిస్పహాయస్థితిలో ప్రజాగ్రహం తమపైన ఎక్కడా పెల్లుభికుతుందోననే భయంతోనే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కు దిగజారుతున్నారు. వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా.. వైయస్ జగన్ గారిని, వారి కుటుంబసభ్యులను, వారి అనుయాయుల వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కుట్రలు చేయడం. గతంలో మదనపల్లి ఫైల్స్, తిరుపతి లడ్డూ, అదానీ సెకీ వ్యవహారం అంటూ నెలకు ఒక అంశాన్ని తీసుకువచ్చి నానా రచ్చ చేశారు. వాటిల్లో ఏ ఒక్కటీ వాస్తవం కాదని తేలడంతో మళ్ళీ వాటిపై నఓరు మెదపడం లేదు. తాజాగా ఈ ఏడాది తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఈ ఏడాది ఎగ్గొడుతూ ఇటీవలే కేబినెట్ సమావేశంలో నిర్ణయిం తీసుకున్నారు. దీనిపైన ఎక్కడ ప్రజలు తమపై విరుచుకుపడతారోననే భయంతో కొత్తగా రూ.700 కోట్ల విలువైన కుంబకోణం జరిగిందంటూ, దీనిలో వైయస్ జగన్ గారు, ఆయన తమ్ముడు వైయస్ సునీల్, జగన్ గారి పీఏ కె.నాగేశ్వరరెడ్డి లబ్ధిదారులుగా ఉన్నారంటూ అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క ఫేక్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకుని ఐ-టీడీపీ, తమకు అనుకూల సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేయడం... దానిని ఎల్లో మీడియాకు అందించడం... వారు దానినే ఎజెండాగా చేసుకుని పుంఖానుపుంఖాలుగా కథనాలు అల్లడం ఒక పరిపాటిగా మారింది. ఈ ఏడు వందల కోట్ల రూపాయల కుంబకోణం ప్రచారంపై కొన్ని ఛానెల్స్ విచ్ఛలవిడిగా ఇదే నిజం అనే రీతిలో ప్రచారం చేస్తున్నాయి. దీనిలో ఒక్క వాస్తవం అయినా చూపించగలరా? శ్రీమతి వైఎస్ భారతీ గారు, ఆమె బినామీలు అంటూ కూడా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరో చీమకుర్తి శ్రీకాంత్ అంటున్నారు, సబ్ రిజిస్ట్రార్ సింగ్ అంటున్నారు. వీరితో వైయస్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందంటూ కట్టుకధలను అల్లుకుంటూ పోతున్నారు. దిగజారిన టీడీపీ మీడియా.. ఎవరైనా మా భూమిని దౌర్జనయంగా లాక్కున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారా? ఏ సబ్ రిజిస్ట్రార్ అయినా దీనికి సంబధించిన ఆధారాలు ఇవిగో అని వెల్లడించారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయితే అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా కిందిస్తాయి నటుల ఫోటోలను పెట్టి, దారుణమైన థంబ్ నెయిల్స్ తో ఈ వ్యవహారాన్ని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. అసభ్యకరమైన ఫోటోలను పెట్టి, అభ్యంతరమైన థంబ్ నెయిల్స్ తో నెటిజన్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయికి దిజగారిన తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియాపై తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. అలాగే వీటిని ఊటంకిస్తూ తప్పుడు కథనాలను ప్రచురించిన మెయిన్ స్ట్రీం మీడియాపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా వీరిని కోర్ట్ కు లాగుతాం. తెలుగుదేశంకు చెందిన ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ సింగ్ అనే అధికారిపై వైయస్ఆర్ సీపీ హయాంలోనే ఏసీబీ కేసులు నమోదయ్యాయి. వారు ఆరోపిస్తున్నట్లు సదరు అధికారి మాకు అనుకూలమైన వ్యక్తి అయితే అతనిపై మా ప్రభుత్వంలోనే కేసులు నమోదు చేస్తారా? కనీస ఇంగితం కూడా లేకుండా దీనిపై ఎలా కథనాలను ప్రచురిస్తున్నారు? ఇదే చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి మీడియాతో వైయస్ జగన్ కుటుంబసభ్యులు, కే.నాగేశ్వరరావుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. అయినా కూడా వారిని ఈ వ్యవహారంతో ముడిపెట్టి ప్రచారం చేయడం ఖచ్చితంగా కుట్రే. మళ్ళీ అధికారంలోకి వస్తాం వైయస్ జగన్ సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతారు. ఆయన ఎదుగుదలను అడ్డుకోవడానికి చేసే ఇటువంటి కుట్రలను ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మళ్ళీ ప్రజల ఆదరణతో అధికారంలోకి వస్తాం. ఇటువంటి తప్పుడు కథనాలతో కుట్రలు చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు. చట్టపరంగానే వారిపై చర్యలు తీసుకుంటా. ఉప ముఖ్యమంత్రి మాట్లాడితే సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ఉండాలి, తప్పుడు రాతలు రాయకూడదు అని చెబుతుంటారు. మరి మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు జరుగుతున్న ఈ కుట్రపూరిత రాతలు, ఆరోపణల ప్రచారంపై ఏం మాట్లాడతారు అని శివశంకర్‌రెడ్డి ప్రశ్నించిచారు.