వందల మంది దొంగలకు నాయకుడు చంద్రబాబు

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి

చంద్రబాబు తన పాలనను వివరించి ఓట్లు అడగడం లేదు

వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై బురద చల్లాలని ప్రయత్నం

17 కేసుల్లో స్టేలు తెచ్చుకొని చంద్రబాబు బతుకుతున్నారు

విశాఖలో గంటా భూకబ్జాలను ప్రోత్సహించింది చంద్రబాబు కాదా?

అచ్చెన్నాయుడు మీదున్న కేసుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు

హైదరాబాద్‌: టీడీపీలో ఉన్న వందల మంది దొంగలకు చంద్రబాబే నాయకుడని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లు పెడుతూ..ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రభుత్వం చేసిన అభివృద్ధికి గురించి చెప్పమనడం లేదని, చంద్రబాబు తన పాలనను వివరించి ఓట్లు అడగడం లేదన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నేరస్తులు ఉన్నారని, కేసులున్న వారు ఉన్నారని, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయమని చంద్రబాబు తన శ్రేణులకు పదే పదే సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్‌ రోజు వరకు కూడా ఇదే ప్రచారం చేయమని ఆయన టెలీ కాన్ఫరేన్స్‌ల ద్వారా ఇస్తున్న సందేశం అన్నారు. ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు క్రిమినల్‌ ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు.

 వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెట్టారన్నారు. వైయస్‌ జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రల ఫలితమే వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు అని చెప్పారు. చంద్రబాబు తనమీదున్న కేసుల్లో «ధైర్యంగా విచారణ ను ఎదుర్కొన్నాడా అని నిలదీశారు. 17 కేసుల్లో స్టేలు తెచ్చుకొని చంద్రబాబు బతుకుతున్నారని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో చ ంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని, బ్రీఫ్డ్‌మీ అన్న గొంత తనది కాదని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదన్నారు. అవినీతి, అక్రమాలతో పార్టీని నడుతున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 

చంద్రబాబు బినామీ సుజనా చౌదరి వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారన్నారు. రూ.6 వేల కోట్ల ఆర్థిక నేరగాడు సుజనా చౌదరి అని చెప్పారు. చంద్రబాబు మరో బినామీ సీఎం రమేష్‌పై విచారణ అంటే ఎందుకు నానా యాగీ చేశారని నిలదీశారు. మంత్రి గంటా శ్రీనివాస్‌ విశాఖలో ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు. రాయపాటి సాంబశివరావు, అచ్చెన్నాయుడి గురించి అందరికీ తెలిసిందే అన్నారు. పెందుర్తి అభ్యర్థి బండారు సత్యనారాయణ భూములన్నీ మింగేస్తే దాన్ని బయటకు రాకుండా తొక్కి పట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డు భూములను మింగేసింది ప్రత్తిపాటి పుల్లారావు కాదా అని నిలదీశారు. బొండా ఉమా భూ కబ్జాల మీద చంద్రబాబు దృష్టి పెట్టారా అన్నారు. అనకాపల్లి టీడీపీ అభ్యర్థి పీలా గోవింద్‌ అక్రమ ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై 26 క్రిమినల్‌ కేసులు ఉన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. వీటన్నింటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆమె డిమాండు చేశారు. 
 

Back to Top