సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన నూత‌న ఎమ్మెల్సీలు

అమ‌రావ‌తి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూత‌న ఎమ్మెల్సీలు అసెంబ్లీలోని సీఎం ఛాంబ‌ర్‌లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మర్రి రాజశేఖర్, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, వీవీ సూర్యనారాయణ రాజు పెన్మత్స, బొమ్మి ఇజ్రాయెల్, జయమంగళ వెంకటరమణ, ఎస్‌.మంగమ్మ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ‌కు శాస‌న‌మండ‌లి స‌భ్యులుగా అవ‌కాశం క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నూతన ఎమ్మెల్సీలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో నూత‌న ఎమ్మెల్సీతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Back to Top