పచ్చ పార్టీ ఉందా...బంగాళాఖాతంతో నిమజ్జనమైందా? 

వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

తాడేప‌ల్లి: ఇటీవ‌ల టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపున‌కు ఆ  పార్టీ  నేత‌లు స్పందించ‌క‌పోవ‌డంపై వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా చుర‌క‌లంటించారు.  ఫోర్జరీ, భూఆక్రమణ కేసులో ఇరుక్కున్న అరగుండు పాత్రుడి అరెస్టుపై రాష్ట్రమంతా సెగలు పుట్టేలా ధర్నాలు చేయాలని చంద్రం ఫోన్లు చేశాడు. విషాదం ఏమిటంటే ఎక్కడా 15-20 మంది కూడా బయటకు రాలేదు. కొన్ని జిల్లాల్లో తుప్పు ఆదేశాలను లెక్కే చేయలేదు. పచ్చ పార్టీ ఉందా...బంగాళాఖాతంతో నిమజ్జనమైందా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఎవరినీ అరెస్ట్ చేయొద్దట!
ఈ మూడున్నరేళ్లలో సొంత పార్టీ నేతలకు బెయిల్స్, స్టేలు ఇప్పించడం, ప్రభుత్వం మీద కుట్రలు చేయడంతోనే సరిపోయింది బాబుకి. ఎవరినీ అరెస్ట్ చేయొద్దట! కులాల ప్రస్తావన తెస్తాడు. చట్టం అందరికీ ఒకటే అంటే ఒప్పుకోడు. ప్రజలను పూర్తిగా మర్చిపోయాడు. 14 ఏళ్ల జ్ఞాపకాల్లోనే బతుకీడుస్తున్నాడు అంటూ అంత‌కుముందు విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top