దక్షిణమధ్య రైల్వే జీఎంతో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు భేటీ

పెండింగ్‌ ప్రాజెక్టులు, నిధుల విడుదలపై చర్చ

విజయవాడ: దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌తో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు, నిధుల విడుదలపై ఈ సమావేశంలో చర్చించారు. రైల్వే పెండింగ్‌ ప్రాజెక్టులపై దక్షిణమధ్య రైల్వే జనరల్‌ గజానన్‌తో ఎంపీలు చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీ మార్గాని భరత్‌ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరామన్నారు. విశాఖ నుంచి మూడో రైల్వే లైన్‌ ఏర్పాటుపై చర్చించామని, కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైన్‌ పూర్తి చేయాలని జీఎంను కోరినట్టు వివరించారు. అదే విధంగా నడికుడి– శ్రీకాళహస్తి రైల్వే లైన్‌ త్వరితగతిన పూర్తి చేయాలని కోరామన్నారు. పెండింగ్‌లో ఉన్న కోనసీమ రైల్వే లైన్‌పై ఈ సమావేశంలో చర్చించినట్టు ఎంపీ మార్గాని భరత్‌ వివరించారు. 
 

Back to Top