విచారణ పారదర్శకంగా సాగాలని కోరుకుంటున్నా..

సీబీఐకి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి లేఖ

వైయస్‌ఆర్‌ జిల్లా: సీబీఐ విచారణకు హాజరవుతున్నానని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత వైయస్‌ వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైనప్పటి నుంచి తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని, పనిగట్టుకుని ఓ వర్గం మీడియా అసత్య కథనాలు ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు.  అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నానని చెప్పారు. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్‌లకు అనుమతించాలని, తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతివ్వాలని, తన విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. 

Back to Top