దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త  ఒరవడి బాబూ జ‌గ్జీవ‌న్ రామ్‌

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త  ఒరవడి డాక్ట‌ర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ అని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడు, అణగారినవర్గాల గొంతుక, దేశ తొలి దళిత ఉపప్రధాని బాబూ జగజ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఆయ‌న నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త  ఒరవడి ఆయన. నాలుగు దశాబ్దాలు పార్లమెంట్ సభ్యునిగా ఉంటూనే...అజాత శత్రువుగా పేరుతెచ్చుకున్నారు. ఆయన స్ఫూర్తిని రాజకీయాల్లో కొనసాగిద్దామ‌ని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అంత‌కుముందు మ‌రో ట్వీట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి అక్ష‌రాస్య‌త‌పై స్పందించారు. 'అరచేతిలో స్వర్గం' అనే సామెత చంద్రబాబు దగుల్బాజీ మాటల ముందు బోసిపోయి కనిపిస్తుంది. 2019కల్లా రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధిస్తామని 2015 ఉపాధ్యాయ దినోత్సవం నాడు చిటికెలేశాడు బాబు. 2011లో లిటరసీ రేటు 67% ఉంటే, 2019 లో ‘సారు’ దిగిపోయేనాటికి కూడా 67% దగ్గరే ఆగిపోయిందంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top