‘బొక్కబోర్లా పడ్డాడేమిటీ విజనరీ’

తాడేపల్లి: చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శణాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికెత్తిన ఎల్లో మీడియా బాబు గారికి తగిలించిన బిరుదులివి. చాణక్యుడు, వ్యూహకర్త, దేశ రాజకీయాలను బొంగరంలా తిప్పిన ఉద్దండుడు, 20–30 ఏళ్ల ముందస్తు ఆలోచనలు చేసిన విజనరీ. మరి సొంత ఎమ్మెల్యేలతో ఓటు వేయించుకోలేక బొక్కబోర్లా పడ్డాడేమిటి. ఏమిటీ పరాభవం’ అంటూ ట్వీట్‌ చేశారు.  

అదే విధంగా ‘కరోనా కష్ట కాలంలోనూ మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్నారు యువ ముఖ్యమంత్రి. 80 వేలకు పైగా నేతన్నల కుటుంబాలకు లబ్ది. జగన్‌ గారి చేతుల మీదుగా వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ప్రారంభం. ఆర్నెల్లు ముందుగానే నేతన్నల ఖాతాల్లో డబ్బు జమ. మాటల్లో కాదు, చేతల్లో చూపే నిజమైన బడగుల పార్టీ వైయస్‌ఆర్‌సీపీ’ అంటూ మరో ట్వీట్‌లో చేశారు. 
 

Back to Top