అమరావతి: పోలవరం అంచనాల పెంపుపై ఢిల్లీ హైకోర్టు విచారణకు ఆదేశించడంతో చంద్రబాబు స్వరం మారిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ‘పోలవరం అంచనాలను రూ.16 వేల కోట్ల నుంచి రూ. 58 వేల కోట్లకు పెంచడంలో జరిగిన అవినీతిపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర జలవనరుల శాఖను విచారణకు ఆదేశించిన తర్వాత చంద్రబాబు స్వరం మారింది. నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు అవే అబద్ధాలు. అదే సొల్లు’ మాట్లాడుతున్నాడని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.