త‌ప్పడు పోస్టు చేసిన‌వారిపై చర్యలు తీసుకోవాలి

పోలీసులకు ఎంపీ రఘురామ‌కృష్ణంరాజు ఫిర్యాదు
 

ఢిల్లీ:  తన ప్రసంగాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పోలీసులు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో చేసిన తప్పులకు పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పేందుకే మంత్రి ఇటువంటి నిర్ణయం తీసుకున్నానని అన్నారు. అందుకు అనుగుణంగానే మంత్రి పీఏ పోలీస్‌ స్టేషన్‌లో  ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.   పార్లమెంట్ లో నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు ప్రసంగాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడుగా పోస్ట్ చేసిన మద్దుకూరి సురేష్ కుమార్ను అరెస్ట్ చేసిన భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. పార్లమెంటుకు తాగి రాకుండా బ్రెత్ అనలైజర్లు పెట్టాలని తనను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారికి ఇది తన హెచ్చరిక అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను మంచి అవసరాలకు వినియోగించాలని కానీ, ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉద్దేశపూర్వక పోస్టులు చేయడం చట్ట రీత్యా నేరంగా పరిగణించి సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

 

Back to Top