ప్ర‌త్యేక హోదా కోసం కృషి

వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌స‌భ ప‌క్ష నేత మిథున్‌రెడ్డి

అమ‌రావ‌తి:  విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌ధాన హామీ అయిన ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు గ‌ట్టిగా కృషి చేస్తాన‌ని వైయ‌స్ఆర్‌సీపీ లోక్‌స‌భ ప‌క్ష నేత, ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో లోక్ సభలో వైయ‌స్ఆర్‌సీపీ పక్ష నేతగా తనకు వైయ‌స్ జగన్ అవకాశమిచ్చారని అన్నారు.  వైయ‌స్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు.  గ‌తంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. బాబు హయాంలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయట పెడతామని, ఇందుకు సంబంధించి జ్యుడిషియల్ కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top