వైయ‌స్ జ‌గ‌న్ సార‌థ్యంలో సుప‌రిపాల‌న

సీఎం వైయ‌స్‌ జగన్‌ తన మార్క్‌ చూపించారు

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌

 తూర్పుగోదావ‌రి: ప్రభుత్వ ఏర్పడిన వారం రోజుల్లోనే సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై తన మార్క్‌ చూపించారని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ  మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. ఉద్యోగుల కష్టాన్ని జగన్‌ గుర్తిస్తారని ఆశా వర్కర్ల జీతాల పెంపుతో రుజువైందని తెలిపారు. శుక్రవారం భరత్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల ఆకాంక్షలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజమండ్రిలోని చారిత్రక గౌతమీ గ్రంథాలయంకు జాతీయస్థాయి గుర్తింపు దక్కేలా కృషిచేస్తానన్నారు. పార్టీ చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌రామ్‌ ఎంపికయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top