నూటికి నూరుపాళ్లు మేనిఫెస్టో అమలు చేస్తాం

వైయస్‌ఆర్‌ సంక్షేమం స్ఫూర్తితో రూపొందిస్తున్నాం

రాష్ట్ర స్థితిగతులు మార్చేవిధంగా వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో తయారుచేస్తాం

విజయవాడ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం

వివిధ అంశాలను వివరించిన కమిటీ అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

విజయవాడ: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమాల స్ఫూర్తితో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 30 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశంలో అనేక విషయాలపై చర్చించామని చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 14 నెలల పాటు 13 జిల్లాల్లో దిగ్విజయంగా పూర్తి చేశారన్నారు. పాదయాత్రలో అనేక వర్గాల ప్రజల సమస్యలు, భౌగోళిక పరిస్థితులు ప్రత్యక్షంగా చూశారన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిస్థితులను బట్టి వైయస్‌ జగన్‌ వాగ్దానాలు చేశారని, వాటన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు. 

ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని వైయస్‌ జగన్‌ నవరత్నాలను ప్రకటించారన్నారు. నవరత్నాలు అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే విధంగా ఉన్నాయని, వాటన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏయే అంశాలను ముందుగా పొందుపర్చాలి అనే అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు నూటికి నూరుపాళ్లు అమలు చేసే విధంగా రూపొందిస్తామన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుబంధ విభాగాలతో 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో మేనిఫెస్టో కమిటీ సభ్యులు సమావేశమవుతారని ఉమ్మారెడ్డి చెప్పారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చిస్తారని, జిల్లా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తారన్నారు. అదే విధంగా మేనిఫెస్టోలో చేర్చాల్సిన సమస్యలు చెప్పుకునేందుకు విజయవాడ పార్టీ కార్యాలయానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైనా రావొచ్చన్నారు. దూర ప్రాంతాల వారు krishnaysrcpoffice@gmail.comకు మెయిల్‌ పంపించవచ్చని సూచించారు. 

కొందరు వ్యక్తులు లేనిపోని అపోహలు సృష్టించి లబ్ధిపొందాలని కుట్రలు చేస్తున్నారని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.  రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారన్నారు. ఎంపీలు పార్లమెంట్‌లో రాజీనామాలు చేసి ఆమరణ దీక్షకు కూడా కూర్చున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, చట్టంలో పెట్టిన అంశాలపై పోరాడుతాం, సాధిస్తామని మేనిఫెస్టోలో ప్రధానంగా ఇవ్వబోతున్నామన్నారు. 

వ్యవసాయం, ఇరిగేషన్, పాడిపరిశ్రమ అంశాలపై సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి ఇంకా కొంత సమాచారం సేకరిస్తామన్నారు. 

డ్వాక్రా మహిళలకు అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో చాలా బాగా పనిచేసే డ్వాక్రా సంఘాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తరువాత దెబ్బతిన్నాయన్నారు. మహిళా సంక్షేమం, సమస్యలు తెలుసుకోవడానికి ప్రత్యేక మైన కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికీ సంబంధించి ఏయే హామీలను పొందుపర్చాలనే చర్చిస్తున్నాం. వీటిలో దివ్యాంగుల సమస్యలు కూడా పొందురుస్తాం. 

విద్యా, ఉపాధి, యువత వీరి సమస్యలు తెలుసుకుంటాం. విద్యను మెరుగుపరచాల్సిన అంశాలేంటీ..? విద్యా సంస్థల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రైవేట్‌ విద్యలో ఉన్న అవకతవకలను ఏ విధంగా అరికట్టాలనేది చర్చిస్తున్నాం. దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఫీజురీయంబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం. 

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదవాళ్లకు కార్పోరేట్‌ వైద్యం అందించారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నీరుగార్చారు. దాన్ని కూడా మెరుగుపరుస్తాం. 

 ◆   మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం విశేషాలు

 ◆ జగన్ గారి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలు అన్ని మేనిఫెస్టోలో ఉంటాయి

◆ మేనిఫెస్టోలో సూచనలు, సలహాలు కోసం మెయిల్ క్రియేట్ చేశాం. ఆ మెయిల్ కు పంపవచ్చు. 

◆ అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారాలు మా మేనిఫెస్టోలో ఉంటాయి

◆ ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది. రాజధాని అభివృద్ధి కి కట్టుబడి ఉంటాం..

◆ రాజధాని అమరావతే.. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదు. వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు.

◆ ప్రత్యేక హోదా, విభజన హామీలు అన్నీ మేనిఫెస్టోలో ఉంటాయి

◆ వ్యవసాయం, సాగునీరు, మహిళలు, సంక్షేమం, విద్య, ఉపాధి, యువత సంబంధిత అంశాలు అన్నిమేనిఫెస్టోలో ఉంటాయి.

◆ వైద్యం, ఉద్యోగులు, పెన్షనర్లు,  ఎక్స్ సర్వీసుమేన్, హౌసింగ్, పరిశ్రమలు, ఎన్నారై ల సమస్యలు అన్ని మ్యానిఫెస్టోలో ఉంటాయి

◆ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలుచేస్తాం

◆ మార్చ్ 6 న మ్యానిఫెస్టో కమిటీ మరోసారి భేటి అవుతుంది. 

◆ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాలను స్పూర్తి గా తీసుకుంటాం. 

◆ నవరత్నాలు అధారంగా మేనిఫెస్టో ఉంటుంది...
◆ రాజధాని భూములు, అగ్రిగోల్డ్ వంటి అంశాలు పొందుపరుస్తాం..

◆ వంద శాతం నెరవేర్చగలిగే అంశాలనే మా మేనిఫెస్టోలో రూపొందిస్తాం..

◆ విజయవాడ పార్టీ కార్యాలయంలో రేపటి నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజల నుండి సూచనల కోసం ప్రత్యేక సెల్ ఏర్పటు..

◆ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ప్రధాన అజెండా మేనిఫెస్టోలో పొందుపరుస్తాం..

◆ అంశాల వారిగా సబ్ కమిటీలు నియమించి వాటిని చేరుస్తాం..
◆ విద్య, వైద్యం, మహిళలు, రైతులకు పెద్ద పీట వేస్తాం..

 

Back to Top