అంబేద్కర్ కోనసీమ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన గురించి గడప గడపకు వెళ్లి అడగాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ప్రభుత్వంపై, తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలను తోట త్రిమూర్తులు తిప్పికొట్టారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది చంద్రబాబే అని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలనను ఇతర రాష్ట్రాలు అభినందిస్తున్నాయని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ సంక్షేమం ఆగలేదన్నారు. ఏ రోజైనా చంద్రబాబు పేదవాడికి సెంటు ఇళ్ల స్థలం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి సొంతింటి కలను సీఎం వైయస్ జగన్ నిజం చేశారని, రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని చెప్పారు. ఉచిత విద్యుత్‌పై మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని హెచ్చరించారు. రైతులకు ఇచ్చిత విద్యుత్ ఇచ్చింది మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని తెలిపారు. చంద్రబాబు తన వయసుకు తగ్గట్టు మాట్లాడాలని సూచించారు. తాను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానని చెబుతున్నాడు. 1978లో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మీ కుమారుడు లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. చంద్రబాబు నా గురించి దిగజారి మాట్లాడుతున్నారు. 1994లో రామచంద్రాపురంలో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిన చంద్రబాబు అవిశ్వాస తీర్మానం సమయంలో నా ఓటుతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఇసుక అంతా దోచేసిన వ్యక్తి టీడీపీ నేత జోగేశ్వరరావు. కేశవరావు మెట్టలు, కొండలన్నీ తవ్వేశారు. మండపేటలో టీడీపీ నేతల అవినీతి గురించి అందరికీ తెలుసు. ఎవరు ఏం దోచుకున్నారో చర్చకు నేను సిద్ధమని తోట త్రిమూర్తులు సవాలు విసిరారు.