ప్రజలు ఉరిశిక్ష వేసిన సంగతి టీడీపీ గుర్తుంచుకోవాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌

అనంతపురం: చంద్రబాబు రోజు రోజుకు దిగజారిపోతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనపై టీడీపీ ఛార్జిషీట్‌ వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న టీడీపీ.. రోజుకో కుట్ర చేస్తోందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఉరిశిక్ష వేసిన సంగతి టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్క హామీని కూడా చంద్రబాబు సంపూర్ణంగా నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తొలి ఏడాదిలోనే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేష్‌లు గోబెల్స్‌ ప్రచారాన్ని మానుకుంటే వారికే మంచిదని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదన్నారు. 

Back to Top